Nivveragudo numdaana ninnum joosi

నివ్వెరగుతో నుందాన నిన్నుఁ జూచి
Language

(॥పల్లవి॥)
నివ్వెరగుతో నుందాన నిన్నుఁ జూచి
జవ్వనపు సంపదలు సందు చూపరాదు

(॥నివ్వె॥)
మనసార నేనీతో మాటలాడేనంటేను
వినేయందునీకైతే వేళలేదు
పనివడి యప్పటిని పాదాలు గుద్దేనంటేను
యెనసి కొలువేగాని యేకాంతము లేదు

(॥నివ్వె॥)
సారెసారె నీతోను సరసమాడేనంటే
కోరి నీవలపులకు గురిలేదు
గారవించి నిన్ను నంటి కళలురేఁచేనంటే
యీరీతినైన నీకు ఇంపులేదు

(॥నివ్వె॥)
గక్కున నిన్నుఁ గదిసి కాఁగిట బాగిసేనంటే
తక్కరితనాన నీకు తనివిలేదు
అక్కరై శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి
యెక్కువతక్కువ లెంచ యీరసము లేదు

(||pallavi||)
nivvĕragudo nuṁdāna ninnum̐ jūsi
javvanabu saṁpadalu saṁdu sūbarādu

(||nivvĕ||)
manasāra nenīdo māḍalāḍenaṁṭenu
vineyaṁdunīgaide veḽaledu
panivaḍi yappaḍini pādālu guddenaṁṭenu
yĕnasi kŏluvegāni yegāṁtamu ledu

(||nivvĕ||)
sārĕsārĕ nīdonu sarasamāḍenaṁṭe
kori nīvalabulagu guriledu
gāraviṁchi ninnu naṁṭi kaḽalurem̐senaṁṭe
yīrīdinaina nīgu iṁpuledu

(||nivvĕ||)
gakkuna ninnum̐ gadisi kām̐giḍa bāgisenaṁṭe
takkaridanāna nīgu taniviledu
akkarai śhrīveṁkaḍeśha aṁtalo nannelidivi
yĕkkuvadakkuva lĕṁcha yīrasamu ledu