Nivveragudo naabe nimdugunnadi

నివ్వెరగుతో నాపె నిండుకున్నది
Language

(॥పల్లవి॥)
నివ్వెరగుతో నాపె నిండుకున్నది
జవ్వనము రేఁచిపెట్టి చలమిఁకఁ దగునా

(॥నివ్వె॥)
వొత్తి విన్నవించలేక వొద్ద నిలుచున్న దింతి
చిత్తగించి యామాట సేయరాదా
బత్తితోడ నియ్యరానిబాసలెల్లా నిచ్చితట
పొత్తు గుడిచితివట బొంకనింకఁ దగునా

(॥నివ్వె॥)
కక్కసించలేక నీపై కాఁకలు చల్లీ నింతి
చిక్కుల ఆపె చనవు చెల్లించరాదా
మిక్కిలి యాపెకు నీవు మేలువాఁడవూనట
దక్కివున్నాఁడవూనట తచ్చ నింకఁదగునా

(॥నివ్వె॥)
చేవట్టి తియ్యఁగ లేక సిగ్గులు వడీ నింతి
సేవలు సేయించుకొని చెల్లఁగరాదా
శ్రీ వేంకటేశ్వర ఇట్టె చేకొని కూడితివట
భావము మాలోనిదట పంత మిఁకఁ దగునా

(||pallavi||)
nivvĕragudo nābĕ niṁḍugunnadi
javvanamu rem̐sibĕṭṭi salamim̐kam̐ dagunā

(||nivvĕ||)
vŏtti vinnaviṁchalega vŏdda nilusunna diṁti
sittagiṁchi yāmāḍa seyarādā
battidoḍa niyyarānibāsalĕllā nichchidaḍa
pŏttu guḍisidivaḍa bŏṁkaniṁkam̐ dagunā

(||nivvĕ||)
kakkasiṁchalega nībai kām̐kalu sallī niṁti
sikkula ābĕ sanavu sĕlliṁcharādā
mikkili yābĕgu nīvu meluvām̐ḍavūnaḍa
dakkivunnām̐ḍavūnaḍa tachcha niṁkam̐dagunā

(||nivvĕ||)
sevaṭṭi tiyyam̐ga lega siggulu vaḍī niṁti
sevalu seyiṁchugŏni sĕllam̐garādā
śhrī veṁkaḍeśhvara iṭṭĕ segŏni kūḍidivaḍa
bhāvamu mālonidaḍa paṁta mim̐kam̐ dagunā