Niradi nerumgudumu nee suddulinniyunu

నిరతి నెరుఁగుదుము నీ సుద్దులిన్నియును
Language

(॥పల్లవి॥)
నిరతి నెరుఁగుదుము నీ సుద్దులిన్నియును
తెరమరఁగు దీసితే దేవరవు గావా

(॥నిరతి॥)
పాసిక విద్యలవారి పక్షపాతివైన నీవు
బాసలెన్ని చేసినాను పాటిలేవు
ఆసపడి నిన్ను నమ్మినట్టి గొల్లెతదలెల్లా
దోసమెంచక పాసినతొంటినీవే కావా

(॥నిరతి॥)
గోమున రాజుకుఁ బుట్టి గొల్లవాఁడవైననీవు
నేమమెంత సేసినాను నిజమేది
ప్రేమతోడ మేనవాని పెండ్లికిఁ బోయి పడుచు
గామించి తెచ్చుకొనిన ఘనుఁడవే కావా

(॥నిరతి॥)
వెగటురాకాసుల వేఁటలాడినట్టినీవు
నగవెంత నవ్వినాను నమ్మరాదు
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నేలి వేవేలు
మగువలఁ దెచ్చుకొన్న మగఁడవే కావా

(||pallavi||)
niradi nĕrum̐gudumu nī suddulinniyunu
tĕramaram̐gu dīside devaravu gāvā

(||niradi||)
pāsiga vidyalavāri pakṣhabādivaina nīvu
bāsalĕnni sesinānu pāḍilevu
āsabaḍi ninnu namminaṭṭi gŏllĕdadalĕllā
dosamĕṁchaga pāsinadŏṁṭinīve kāvā

(||niradi||)
gomuna rājugum̐ buṭṭi gŏllavām̐ḍavainanīvu
nemamĕṁta sesinānu nijamedi
premadoḍa menavāni pĕṁḍligim̐ boyi paḍusu
gāmiṁchi tĕchchugŏnina ghanum̐ḍave kāvā

(||niradi||)
vĕgaḍurāgāsula vem̐ṭalāḍinaṭṭinīvu
nagavĕṁta navvinānu nammarādu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nanneli vevelu
maguvalam̐ dĕchchugŏnna magam̐ḍave kāvā