నిరతి నా భారమెల్ల నీవు మోఁచుకుండఁగాను
(॥పల్లవి॥)
నిరతి నా భారమెల్ల నీవు మోఁచుకుండఁగాను
యిరవై యెరఁగనైతి నేమందు నేను
(॥నిర॥)
చెక్కుచేయి నాకేల చిన్నఁబోయి వుండనేల
గక్కన నాలో నీవు గలిగుండఁగా
నిక్కి నిక్కి చూచితివి నీవు రావంటా నిందాఁకఁ
నిక్కడ నా వెఱ్ఱితన మేమందు నేను
(॥నిర॥)
వట్టిజాలి నాకేల వారి వీరి దూరనేల
అట్టె నీవు నాకుఁ బతివై వుండఁగా
నెట్టిన నేఁబదరితి నీవు విచారించవంటా
యిట్టి నా యెడ్డతనాన నేమందు నేను
(॥నిర॥)
చెప్పిపంప నాకేల సిగ్గుతోడ బొంకనేల
కప్పి నీవే వచ్చి నన్నుఁగాఁ గిలించఁగా
వొప్పుగా శ్రీవేంకటేశ వొత్తితి రతుల నిన్ను
యిప్పటి నా గబ్బితన మేమందు నేను
(||pallavi||)
niradi nā bhāramĕlla nīvu mom̐suguṁḍam̐gānu
yiravai yĕram̐ganaidi nemaṁdu nenu
(||nira||)
sĕkkuseyi nāgela sinnam̐boyi vuṁḍanela
gakkana nālo nīvu galiguṁḍam̐gā
nikki nikki sūsidivi nīvu rāvaṁṭā niṁdām̐kam̐
nikkaḍa nā vĕṭridana memaṁdu nenu
(||nira||)
vaṭṭijāli nāgela vāri vīri dūranela
aṭṭĕ nīvu nāgum̐ badivai vuṁḍam̐gā
nĕṭṭina nem̐badaridi nīvu visāriṁchavaṁṭā
yiṭṭi nā yĕḍḍadanāna nemaṁdu nenu
(||nira||)
sĕppibaṁpa nāgela siggudoḍa bŏṁkanela
kappi nīve vachchi nannum̐gām̐ giliṁcham̐gā
vŏppugā śhrīveṁkaḍeśha vŏttidi radula ninnu
yippaḍi nā gabbidana memaṁdu nenu