Niradabujaana vavudu nerubari vauduvu

నిరతపుజాణ వవుదు నేరుపరి వౌదువు
Language

(॥పల్లవి॥)
నిరతపుజాణ వవుదు నేరుపరి వౌదువు
సరసమెంతాడేవు చాలు నుండఁగదవే

(॥నిర॥)
వుక్కువంటిది నీగోరు వొగ నాటుఁజేసుఁ బతి
చెక్కులేల నొక్కేవే చెలియ
మొక్కు అప్పటి నీ ముద్దుటుంగర మాతని -
చక్కనిపాదము లొత్తీఁ జాలు నుండఁగదవే

(॥నిర॥)
కొండలవంటి చన్నులు కుమ్మెలుగాఁ దాఁకుఁ జేసు
అండనేల కాఁగిలించే వతివా
పండే వాతని పక్కను బంగారువంటినీమేను
చెండిగాఁ గాఁకలు సేసీఁ జాలు నుండఁగదవే

(॥నిర॥)
అమ్ములవంటివి కన్ను లాయము లంటుఁ జేసు
పమ్మి యాతని చూచేవు పడఁతీ
ఇమ్ముల శ్రీవేంకటేశుఁ డిటు నన్ను నేలినాడు
సమ్మతిగాఁ గూడితివి చాలు నుండఁగదవే

(||pallavi||)
niradabujāṇa vavudu nerubari vauduvu
sarasamĕṁtāḍevu sālu nuṁḍam̐gadave

(||nira||)
vukkuvaṁṭidi nīgoru vŏga nāḍum̐jesum̐ badi
sĕkkulela nŏkkeve sĕliya
mŏkku appaḍi nī mudduḍuṁgara mādani -
sakkanibādamu lŏttīm̐ jālu nuṁḍam̐gadave

(||nira||)
kŏṁḍalavaṁṭi sannulu kummĕlugām̐ dām̐kum̐ jesu
aṁḍanela kām̐giliṁche vadivā
paṁḍe vādani pakkanu baṁgāruvaṁṭinīmenu
sĕṁḍigām̐ gām̐kalu sesīm̐ jālu nuṁḍam̐gadave

(||nira||)
ammulavaṁṭivi kannu lāyamu laṁṭum̐ jesu
pammi yādani sūsevu paḍam̐tī
immula śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nannu nelināḍu
sammadigām̐ gūḍidivi sālu nuṁḍam̐gadave