Nippula meemdadam dechchi nee llemta sallinaanu

నిప్పుల మీఁదటఁ దెచ్చి నీ ళ్లెంత చల్లినాను
Language

(॥పల్లవి॥)
నిప్పుల మీఁదటఁ దెచ్చి నీ ళ్లెంత చల్లినాను
వొప్పుగా నంతటిలోనే వుడు కారునా

(॥నిప్పుల॥)
మనసు నొచ్చినదాన మాటలాడు మంటేను
వనితరో నా కెట్టు వాకు వెళ్లీనే
యెనయక విరహన యేఁచి యిప్పు డిట్టె వచ్చి
చన విచ్చి కూడితేనే చవు లౌనా రతులు

(॥నిప్పుల॥)
సవతులు గలదాన సారెకును నవ్వు మంటే
యివల నా కెటువలె యితవయ్యీనే
తివిరి కోపము రేఁచి తిరుగ బుజ్జగించితే
సవరనిదొరయైతే చల్ల నౌనా నామేను

(॥నిప్పుల॥)
వాసికి బదికేదాన వద్ది కిట్టె రమ్మంటే
యీసు దేరఁ దా రాక నే నెట్టు వచ్చేనే
ఆసల శ్రీ వేంకటేశుఁ డంతలోన నన్నుఁ గలసె
పోసరించి కూడితేనే పోవుగా తమకము

(||pallavi||)
nippula mīm̐daḍam̐ dĕchchi nī ḽlĕṁta sallinānu
vŏppugā naṁtaḍilone vuḍu kārunā

(||nippula||)
manasu nŏchchinadāna māḍalāḍu maṁṭenu
vanidaro nā kĕṭṭu vāgu vĕḽlīne
yĕnayaga virahana yem̐si yippu ḍiṭṭĕ vachchi
sana vichchi kūḍidene savu launā radulu

(||nippula||)
savadulu galadāna sārĕgunu navvu maṁṭe
yivala nā kĕḍuvalĕ yidavayyīne
tiviri kobamu rem̐si tiruga bujjagiṁchide
savaranidŏrayaide salla naunā nāmenu

(||nippula||)
vāsigi badigedāna vaddi kiṭṭĕ rammaṁṭe
yīsu deram̐ dā rāga ne nĕṭṭu vachchene
āsala śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalona nannum̐ galasĕ
posariṁchi kūḍidene povugā tamagamu