Ninum goluvanidellaa nee bhaagyamu

నినుఁ గొలువనిదెల్లా నీ భాగ్యము
Language

(॥పల్లవి॥)
నినుఁ గొలువనిదెల్లా నీ భాగ్యము
సనకాదు లెఱిఁగిరి సర్వమైన పుణ్యము

(॥నిను॥)
వలెనని పేరుకొంటే వాకున సులభుండవు
తలఁచితే మది కెంతే సులభుండవు
చెలఁగి పూజించితేను చేతికి సులభుండవు
వలసితేఁ జేకొనేటి వారి వారి పుణ్యము

(॥నిను॥)
లాచి వింటేఁ జాలు వీనులకు సులభుండవు
చూచితేఁ గన్నుల కెంతే సులభుండవు
యేచి మొక్కితే మేనికి నెంతైనా సులభుండవు
కాచి యుండి సేవించేటి ఘనులదే పుణ్యము

(॥నిను॥)
నమ్మి శరణంటే యీ జన్మమున సులభుండవు
కిమ్ములఁ గోరితే దేహికి సులభుండవు
ఇమ్ముల శ్రీవేంకటేశ యిన్నియునుఁ దా మెఱిఁగి
పమ్మిన కృపఁ జేరిన భక్తులదే పుణ్యము

(||pallavi||)
ninum̐ gŏluvanidĕllā nī bhāgyamu
sanagādu lĕṟim̐giri sarvamaina puṇyamu

(||ninu||)
valĕnani perugŏṁṭe vāguna sulabhuṁḍavu
talam̐side madi kĕṁte sulabhuṁḍavu
sĕlam̐gi pūjiṁchidenu sedigi sulabhuṁḍavu
valasidem̐ jegŏneḍi vāri vāri puṇyamu

(||ninu||)
lāsi viṁṭem̐ jālu vīnulagu sulabhuṁḍavu
sūsidem̐ gannula kĕṁte sulabhuṁḍavu
yesi mŏkkide menigi nĕṁtainā sulabhuṁḍavu
kāsi yuṁḍi seviṁcheḍi ghanulade puṇyamu

(||ninu||)
nammi śharaṇaṁṭe yī janmamuna sulabhuṁḍavu
kimmulam̐ goride dehigi sulabhuṁḍavu
immula śhrīveṁkaḍeśha yinniyunum̐ dā mĕṟim̐gi
pammina kṛpam̐ jerina bhaktulade puṇyamu