నిన్నుఁజూచి నవ్వు వచ్చీ నేఁడు నాకు నిందుకే
(॥పల్లవి॥)
నిన్నుఁజూచి నవ్వు వచ్చీ నేఁడు నాకు నిందుకే
యెన్ని చూచితే నీకు యెదురీడఁ గలదా
(॥నిన్ను॥)
చేముట్టి నీతో నవ్వితే చెలరేఁగి తిట్టేవు
భామతో మారుకొనఁగఁ బంతమా నీకు
నాములువేసేటియుట్టిననలు వాండ్లైతేను
బూమిలోనఁ గోపగించేపురుషులు గలరా
(॥నిన్ను॥)
గోర నిన్ను నూఁదితేను గొబ్బన సూడువట్టేవు
బీర మింతిపైఁ జూపేది పెద్దరికమా
కోరి వురముమీఁదికి కుచములు వేఁకమైతే
బోరన నింతిఁ గోపించేపురుషులు గలరా
(॥నిన్ను॥)
కందున నిన్నుఁ గూడితే కరఁగేవు మనసెల్లా
మందలించి యీకెమీఁదిమచ్చికా ఇది
అంది శ్రీవేంకటేశుఁడ అదరము దీపనుచు
పొంతితివి నీకంటె పురుషులు గలరా
(||pallavi||)
ninnum̐jūsi navvu vachchī nem̐ḍu nāgu niṁduge
yĕnni sūside nīgu yĕdurīḍam̐ galadā
(||ninnu||)
semuṭṭi nīdo navvide sĕlarem̐gi tiṭṭevu
bhāmado mārugŏnam̐gam̐ baṁtamā nīgu
nāmuluveseḍiyuṭṭinanalu vāṁḍlaidenu
būmilonam̐ gobagiṁcheburuṣhulu galarā
(||ninnu||)
gora ninnu nūm̐didenu gŏbbana sūḍuvaṭṭevu
bīra miṁtibaim̐ jūbedi pĕddarigamā
kori vuramumīm̐digi kusamulu vem̐kamaide
borana niṁtim̐ gobiṁcheburuṣhulu galarā
(||ninnu||)
kaṁduna ninnum̐ gūḍide karam̐gevu manasĕllā
maṁdaliṁchi yīgĕmīm̐dimachchigā idi
aṁdi śhrīveṁkaḍeśhum̐ḍa adaramu dībanusu
pŏṁtidivi nīgaṁṭĕ puruṣhulu galarā