నిన్నుఁ జూచి వోర్చుకొని నే నుందానను
(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి వోర్చుకొని నే నుందానను
తన్ను నింతక జంకించి తగ బుద్దిచెప్పనా
(॥నిన్నుఁ॥)
యింటిలోన నీవు నేను నేకతములాడఁగాను
కంటివిగా ఆపె యెంత గయ్యాళించీని
నంటునను నీతో నేను నవ్వులు నవ్వఁగాను
వింటివిగా తా నాడేవెంగేలెల్లాను
(॥నిన్నుఁ॥)
పలుమారు మనమున్న పానుపు దప్పక చూచీ
తెలిసెఁగా నీకు నీకే దిట్టతనము
యెలమి మనవలపు లెగసక్కేలు సేయఁగా
బలిసెఁగా చల మీకెపై నీకు నిపుడు
(॥నిన్నుఁ॥)
యెంచఁగ శ్రీ వేంకటేశ యిద్దరముఁ గూడుండంగా
ముంచెఁగా ఆపెపంతాలు మొత్తమై నీకు
పొంచియుండి మనలోని పొందులెల్లాఁ దలపోసి
నించెఁగా తనరతుల నేరుపులెల్లాను
(||pallavi||)
ninnum̐ jūsi vorsugŏni ne nuṁdānanu
tannu niṁtaga jaṁkiṁchi taga buddisĕppanā
(||ninnum̐||)
yiṁṭilona nīvu nenu negadamulāḍam̐gānu
kaṁṭivigā ābĕ yĕṁta gayyāḽiṁchīni
naṁṭunanu nīdo nenu navvulu navvam̐gānu
viṁṭivigā tā nāḍevĕṁgelĕllānu
(||ninnum̐||)
palumāru manamunna pānubu dappaga sūsī
tĕlisĕm̐gā nīgu nīge diṭṭadanamu
yĕlami manavalabu lĕgasakkelu seyam̐gā
balisĕm̐gā sala mīgĕbai nīgu nibuḍu
(||ninnum̐||)
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha yiddaramum̐ gūḍuṁḍaṁgā
muṁchĕm̐gā ābĕbaṁtālu mŏttamai nīgu
pŏṁchiyuṁḍi manaloni pŏṁdulĕllām̐ dalabosi
niṁchĕm̐gā tanaradula nerubulĕllānu