నిన్నుఁ జూచి వెంగేలు నే నాడఁ జువ్మిూ
(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి వెంగేలు నే నాడఁ జువ్మిూ
విన్న కన్న మాటలకే వేరొకతె యాడేను
(॥నిన్ను॥)
పన్నీట మజ్జనమాడి పైపై తడిసూ ళ్ళొత్తి
వున్నతి నీవు నిలుచుండఁగాఁ జూచి
మున్నే నీ వెవ్వతెనో ముట్టుదానిఁ బొందివచ్చి
విన్నాణాలు చూపేవంటా వేరొకతె నవ్వెను
(॥నిన్ను॥)
కప్పురధూళిమేన కడు నిండా మెత్తుకొని
చిప్పిలఁ దెల్లనిరూపై చెలువొందఁగా
చొప్పున వెన్నముచ్చిమి సొకె నిట్టె మచ్చెమంటా
విప్పుచు నీ కొంగు వట్టి వేరొకతె దీసెను
(॥నిన్ను॥)
వొట్టుక పుళుగు వూసి వురాన నలమేల్మంగ
గట్టుక శ్రీవేంకటేశ కడు మించఁగా
యిట్టె చీకటితప్పు సే సిటు నల్లవైతి వంటా
వెట్టికి నీ నా పొందులు వేరొకతె మెచ్చెను
(||pallavi||)
ninnum̐ jūsi vĕṁgelu ne nāḍam̐ juvmiూ
vinna kanna māḍalage verŏgadĕ yāḍenu
(||ninnu||)
pannīḍa majjanamāḍi paibai taḍisū ḽḽŏtti
vunnadi nīvu nilusuṁḍam̐gām̐ jūsi
munne nī vĕvvadĕno muṭṭudānim̐ bŏṁdivachchi
vinnāṇālu sūbevaṁṭā verŏgadĕ navvĕnu
(||ninnu||)
kappuradhūḽimena kaḍu niṁḍā mĕttugŏni
sippilam̐ dĕllanirūbai sĕluvŏṁdam̐gā
sŏppuna vĕnnamuchchimi sŏgĕ niṭṭĕ machchĕmaṁṭā
vippusu nī kŏṁgu vaṭṭi verŏgadĕ dīsĕnu
(||ninnu||)
vŏṭṭuga puḽugu vūsi vurāna nalamelmaṁga
gaṭṭuga śhrīveṁkaḍeśha kaḍu miṁcham̐gā
yiṭṭĕ sīgaḍidappu se siḍu nallavaidi vaṁṭā
vĕṭṭigi nī nā pŏṁdulu verŏgadĕ mĕchchĕnu