నిన్నుఁ జూచి తనివంది నిలుచున్నది
(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి తనివంది నిలుచున్నది
వున్నతి నీ సతివలె నుండవద్దా వలపు
(॥నిన్ను॥)
వినివిని నీమాఁటల వెరగుతోడ నున్నది
ననుపుఁజేతలకును నవ్వుచున్నది
చనవు నీవియ్యఁగాను సంతోసముతో నున్నది
యెనసి రతిసలుప నెఱఁగకవున్నది
(॥నిన్ను॥)
తప్పక నీవు చూచితే తగులమితో నున్నది
వొప్పగఁ జేయివేసితే వొగ్గుచున్నది
కప్పిన పయ్యదంటితే కరఁగుతాఁదా నున్నది
దప్పికి మోవియడుఁగ దలపోయుచున్నది
(॥నిన్ను॥)
చేరి నీవు చెనకితే చిమ్మిరేఁగుతానున్నది
యీరతి నీకాఁగిఁట బెంపెక్కివున్నది
గారవాన నేఁడు శ్రీవేంకటేశుఁ గూడఁగాను
నేరుపుతో నీవురాన నెలకొనివున్నది
(||pallavi||)
ninnum̐ jūsi tanivaṁdi nilusunnadi
vunnadi nī sadivalĕ nuṁḍavaddā valabu
(||ninnu||)
vinivini nīmām̐ṭala vĕragudoḍa nunnadi
nanubum̐jedalagunu navvusunnadi
sanavu nīviyyam̐gānu saṁtosamudo nunnadi
yĕnasi radisaluba nĕṟam̐gagavunnadi
(||ninnu||)
tappaga nīvu sūside tagulamido nunnadi
vŏppagam̐ jeyiveside vŏggusunnadi
kappina payyadaṁṭide karam̐gudām̐dā nunnadi
dappigi moviyaḍum̐ga dalaboyusunnadi
(||ninnu||)
seri nīvu sĕnagide simmirem̐gudānunnadi
yīradi nīgām̐gim̐ṭa bĕṁpĕkkivunnadi
gāravāna nem̐ḍu śhrīveṁkaḍeśhum̐ gūḍam̐gānu
nerubudo nīvurāna nĕlagŏnivunnadi