Ninnum joosi selulagu nivveṟamgulai vunnavi

నిన్నుఁ జూచి చెలులకు నివ్వెఱఁగులై వున్నవి
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి చెలులకు నివ్వెఱఁగులై వున్నవి
పన్నిన వలపులకు పండుగాయ నేఁడు

(॥॥)
వీడె మిచ్చి చెలి నీకు నిన్నపము సేయఁగాను
వేడుకల కన్నియును వినేవు నీవు
తోడనే వినయాలెల్లా తోడు చూపఁగా నీకు
జాడ తోరేఁగీ సంతములెల్లా నేఁడు

(॥॥)
సంగడిఁ గూచుండి యీకె చనవునఁ జెనకఁగా
అంగమెల్లాఁ జెమరించి యానందించేవు
రంగుమీఱ నీమీద రతిఁజేయి చాఁచఁగా
వుంగిటి(?) మదనకళ లుబ్బీ నీకు నేఁడు

(॥॥)
ఆలిమేలుమంగ నీ యక్కుమీఁద నిలువఁగా
బలిమి శ్రీ వేంకటేశ పచ్చిదేరేవు
యెలమి నీకె మమ్ము నిందరి నేలు మనఁగా
వెల లేని భోగములు వింతలాయ నేఁడు

(||pallavi||)
ninnum̐ jūsi sĕlulagu nivvĕṟam̐gulai vunnavi
pannina valabulagu paṁḍugāya nem̐ḍu

(||||)
vīḍĕ michchi sĕli nīgu ninnabamu seyam̐gānu
veḍugala kanniyunu vinevu nīvu
toḍane vinayālĕllā toḍu sūbam̐gā nīgu
jāḍa torem̐gī saṁtamulĕllā nem̐ḍu

(||||)
saṁgaḍim̐ gūsuṁḍi yīgĕ sanavunam̐ jĕnagam̐gā
aṁgamĕllām̐ jĕmariṁchi yānaṁdiṁchevu
raṁgumīṟa nīmīda radim̐jeyi sām̐sam̐gā
vuṁgiḍi(?) madanagaḽa lubbī nīgu nem̐ḍu

(||||)
ālimelumaṁga nī yakkumīm̐da niluvam̐gā
balimi śhrī veṁkaḍeśha pachchiderevu
yĕlami nīgĕ mammu niṁdari nelu manam̐gā
vĕla leni bhogamulu viṁtalāya nem̐ḍu