నిన్నుఁ జూచి నవ్వఁగానే నిష్టూర మేలే
(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి నవ్వఁగానే నిష్టూర మేలే
వన్నెల నతని మెచ్చవద్దా నీవు
(॥నిన్ను॥)
కూడిన మీఁదట నేలే గొణఁగు ఆతఁ-
డీడనే వున్నాఁడు యింకా నేలే సణఁగు
వీడెము నిన్నడిగీని వెస నీపేరు నుడిగీ
వాడుదేరిచి కలయవద్దా నీవు
(॥నిన్ను॥)
ఇద్దరుఁ గూచుండి యేలె యెరవు- నేఁడు
బద్దులేనివాని కేలే పయి తరవు
బుద్ది చెప్పి చెక్కు నొక్కీ పూఁచి నీకుఁ జేత మొక్కీ
వద్దు వద్దని పలుకవద్దా నీవు
(॥నిన్ను॥)
పరుపుమీఁదనే యాలే పగటు - నీ
విరవై శ్రీవేంకటేశు కేలే వెగటు
అరుదై యలమేల్మంగ వటు నీవు గూడితివి
వరుస లిట్టే నెరపవద్దా నీవు
(||pallavi||)
ninnum̐ jūsi navvam̐gāne niṣhṭūra mele
vannĕla nadani mĕchchavaddā nīvu
(||ninnu||)
kūḍina mīm̐daḍa nele gŏṇam̐gu ādam̐-
ḍīḍane vunnām̐ḍu yiṁkā nele saṇam̐gu
vīḍĕmu ninnaḍigīni vĕsa nīberu nuḍigī
vāḍuderisi kalayavaddā nīvu
(||ninnu||)
iddarum̐ gūsuṁḍi yelĕ yĕravu- nem̐ḍu
baddulenivāni kele payi taravu
buddi sĕppi sĕkku nŏkkī pūm̐si nīgum̐ jeda mŏkkī
vaddu vaddani palugavaddā nīvu
(||ninnu||)
parubumīm̐dane yāle pagaḍu - nī
viravai śhrīveṁkaḍeśhu kele vĕgaḍu
arudai yalamelmaṁga vaḍu nīvu gūḍidivi
varusa liṭṭe nĕrabavaddā nīvu