నిన్నుఁ జూచి నాకైతే నెరవుగా దయవుట్టె
(॥పల్లవి॥)
నిన్నుఁ జూచి నాకైతే నెరవుగా దయవుట్టె
యెన్నిటి కోపుదువు మాయింటికి రావయ్యా
(॥నిన్ను॥)
చేసన్న సేసి యొకతె చెట్టవట్టి తీసె నిన్ను
ఆసల వొకతె నిన్ను నట్టె నవ్వెను
యీసందుల నీమనసు యిరుమొనసూదాయ
సేసల యిద్దరిచేతఁ జిక్కెఁగా నీతురుము
(॥నిన్ను॥)
కందువకుఁ దెచ్చొకతె కాఁగిలించుకుండఁగాను
మందలించి వేరొకతె మర్మమంటీని
అంది తాసువంటిదాయ అట్టె నీరతియెల్ల
సందడి నిద్దరిచేత సదమదమైతివి
(॥నిన్ను॥)
మునుప వేరొకతె నీమోవి గంటిసేయఁ గామ
వెనక నొకతె గోరు వీఁపు మోపీని
యెనసితి నే నిన్ను యింతో శ్రీవేంకటేశ
అనువై ముక్కాలిపీఁట వైతివి గా యిపుడు
(||pallavi||)
ninnum̐ jūsi nāgaide nĕravugā dayavuṭṭĕ
yĕnniḍi kobuduvu māyiṁṭigi rāvayyā
(||ninnu||)
sesanna sesi yŏgadĕ sĕṭṭavaṭṭi tīsĕ ninnu
āsala vŏgadĕ ninnu naṭṭĕ navvĕnu
yīsaṁdula nīmanasu yirumŏnasūdāya
sesala yiddarisedam̐ jikkĕm̐gā nīdurumu
(||ninnu||)
kaṁduvagum̐ dĕchchŏgadĕ kām̐giliṁchuguṁḍam̐gānu
maṁdaliṁchi verŏgadĕ marmamaṁṭīni
aṁdi tāsuvaṁṭidāya aṭṭĕ nīradiyĕlla
saṁdaḍi niddariseda sadamadamaidivi
(||ninnu||)
munuba verŏgadĕ nīmovi gaṁṭiseyam̐ gāma
vĕnaga nŏgadĕ goru vīm̐pu mobīni
yĕnasidi ne ninnu yiṁto śhrīveṁkaḍeśha
anuvai mukkālibīm̐ṭa vaidivi gā yibuḍu