Ninnum jeppi soobidenu nerajaana vinnidaanu

నిన్నుఁ జెప్పి చూపితేను నెరజాణ విన్నిటాను
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ జెప్పి చూపితేను నెరజాణ విన్నిటాను
నన్ను నెన్నిచందాల నమ్మించేవయ్యా???

(॥నిన్నుఁ॥)
మొలకచన్నులదాన మోవితేనెలదాన
నలిరేఁగి నాతో నేమి నవ్వేవయ్యా
చిలుకుఁజూపులదాన సిగ్గరితనాలదాన
పలుమారు నెంత వొడఁబరచేవయ్యా

(॥నిన్నుఁ॥)
కొంచెపు నదిమిదాన కోమలపు మేనిదాన
పొంచి పొంచి యింతయేల పొదిగేవయ్యా
అంచ నడపులదాన అన్నువ పాదాలదాన
వంచనతో మొక్కే నేల వలపించేవయ్యా

(॥నిన్నుఁ॥)
కొడిదెఁడు మోముదాన కోవిల యెలుఁగుదాన
చిడుముడి నెందాఁకాఁ జెనకేవయ్యా
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కడుమేలుదాన నెన్ని కతలు చెప్పేవయ్యా

(||pallavi||)
ninnum̐ jĕppi sūbidenu nĕrajāṇa vinniḍānu
nannu nĕnnisaṁdāla nammiṁchevayyā???

(||ninnum̐||)
mŏlagasannuladāna movidenĕladāna
nalirem̐gi nādo nemi navvevayyā
silugum̐jūbuladāna siggaridanāladāna
palumāru nĕṁta vŏḍam̐barasevayyā

(||ninnum̐||)
kŏṁchĕbu nadimidāna komalabu menidāna
pŏṁchi pŏṁchi yiṁtayela pŏdigevayyā
aṁcha naḍabuladāna annuva pādāladāna
vaṁchanado mŏkke nela valabiṁchevayyā

(||ninnum̐||)
kŏḍidĕm̐ḍu momudāna kovila yĕlum̐gudāna
siḍumuḍi nĕṁdām̐kām̐ jĕnagevayyā
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
kaḍumeludāna nĕnni kadalu sĕppevayyā