నిన్నుఁ గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు
(॥పల్లవి॥)
నిన్నుఁ గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు
పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుఁడవు
(॥నిన్ను॥)
భూపతిఁ జేరితేఁ గొంత భూ మియ్యనోపుఁ గాని
యేపున నున్నతపద మియ్యలేఁడు
తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని
యేపొద్దుఁ జెడని భోగ మియ్యలేఁడు
(॥నిన్ను॥)
గరళకంఠు గొల్చితే కైలాస మీ నోపుఁ గాని
గరిమ ధ్రువపట్టము గట్టలేఁడు
సరి విరించిఁ గొల్చితే సత్యలోకమే కాని
విరజానది దాఁటఁగ వెళ్ళవేయలేఁడు
(॥నిన్ను॥)
అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను
నిన్ను నాశ్రయించక కాన్పించనీదు
కన్నులెదుట శ్రీవేంకటేశ నీ శరణంటే
యెన్నఁగా నీ విచ్చే యీవి యెవ్వఁడూ నీలేఁడు
(||pallavi||)
ninnum̐ gŏlisidem̐ jālu nīyaṁtavānim̐ jeduvu
panni nārāyaṇa nīvu brahmādivaṁdyum̐ḍavu
(||ninnu||)
bhūbadim̐ jeridem̐ gŏṁta bhū miyyanobum̐ gāni
yebuna nunnadabada miyyalem̐ḍu
tībula niṁdruni nārādhiṁchide svargame kāni
yebŏddum̐ jĕḍani bhoga miyyalem̐ḍu
(||ninnu||)
garaḽagaṁṭhu gŏlside kailāsa mī nobum̐ gāni
garima dhruvabaṭṭamu gaṭṭalem̐ḍu
sari viriṁchim̐ gŏlside satyalogame kāni
virajānadi dām̐ṭam̐ga vĕḽḽaveyalem̐ḍu
(||ninnu||)
anniḍā māyāśhakti nāśhrayiṁchi sūsidenu
ninnu nāśhrayiṁchaga kānpiṁchanīdu
kannulĕduḍa śhrīveṁkaḍeśha nī śharaṇaṁṭe
yĕnnam̐gā nī vichche yīvi yĕvvam̐ḍū nīlem̐ḍu