Ninnum dalamsi neeberu dalamsi

నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచి
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచి
నన్నుఁ కరుణించితే నెన్నికగాక

(॥నిన్నుఁ॥)
అధికునిఁ గాచు టేమరుదు నన్ను-
నధమునిఁ గాచుట యరుదుగాక నీకు
మదురమౌ టేమరుదు మధురమూ, చేఁదు
మధురమౌటే మహిలో నరుదుగాక

(॥నిన్నుఁ॥)
అనఘునిఁ గరుణింప నరుదుగాదు నీకు
ఘనపాపుని నన్నుఁ గాచు టరుదుగాక
కనకము గనకము గానేల, యినుము
కనకమవుటే కడు నరుదుగాక

(॥నిన్నుఁ॥)
నెలకొన్నభీతితో నిన్నుఁ జెనకితిఁగాక
తలకొన్నసుఖినైనఁ దలఁచనేల నిన్ను
యెలమితోఁ దిరువేంగళేఁశుడ నాపాలఁ
గలిగి నీకృప గలుగఁ జేతువుగాక

(||pallavi||)
ninnum̐ dalam̐si nīberu dalam̐si
nannum̐ karuṇiṁchide nĕnnigagāga

(||ninnum̐||)
adhigunim̐ gāsu ṭemarudu nannu-
nadhamunim̐ gāsuḍa yarudugāga nīgu
maduramau ṭemarudu madhuramū, sem̐du
madhuramauḍe mahilo narudugāga

(||ninnum̐||)
anaghunim̐ garuṇiṁpa narudugādu nīgu
ghanabābuni nannum̐ gāsu ṭarudugāga
kanagamu ganagamu gānela, yinumu
kanagamavuḍe kaḍu narudugāga

(||ninnum̐||)
nĕlagŏnnabhīdido ninnum̐ jĕnagidim̐gāga
talagŏnnasukhinainam̐ dalam̐sanela ninnu
yĕlamidom̐ diruveṁgaḽem̐śhuḍa nābālam̐
galigi nīkṛpa galugam̐ jeduvugāga