Ninnum bomdinavaarigi nerami yedi

నిన్నుఁ బొందినవారికి నేరమి యేది
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ బొందినవారికి నేరమి యేది
సన్నల నందుకైనాను చన వియ్యవలదా

(॥నిన్నుఁ॥)
అంగన నీకుఁ జేసినయపరాధ మేమీ లేదు
చెంగి చెంగి రాకుండఁ జేల్లునా నీకు
వుంగరాలవేళ్లనే వొడివట్టి తీసె నిన్ను
సంగ తది దలఁచైనా చనవియ్యవలదా

(॥నిన్నుఁ॥)
సతి నీతో నలిగినసడి యించుకా లేదు
తతిఁ బరాకులు సేయఁదగునా నీకు
పతివంటా వేఁడుకొనీ పలుమారు చెక్కునొక్కీ
సతమై యీమేలెంచి చనవియ్యరాదా

(॥నిన్నుఁ॥)
చలి నిన్ను నిట్టె కూడె శ్రీవేంకటేశఁడవని
యెలమి నీవలసేదే యెన్నికా నీకు
పలుమారు నీకు మొక్కి బాసలెల్లఁ జేకొనె
చలములు మాని యిట్టె చనవియ్యవలదా

(||pallavi||)
ninnum̐ bŏṁdinavārigi nerami yedi
sannala naṁdugainānu sana viyyavaladā

(||ninnum̐||)
aṁgana nīgum̐ jesinayabarādha memī ledu
sĕṁgi sĕṁgi rāguṁḍam̐ jellunā nīgu
vuṁgarālaveḽlane vŏḍivaṭṭi tīsĕ ninnu
saṁga tadi dalam̐sainā sanaviyyavaladā

(||ninnum̐||)
sadi nīdo naliginasaḍi yiṁchugā ledu
tadim̐ barāgulu seyam̐dagunā nīgu
padivaṁṭā vem̐ḍugŏnī palumāru sĕkkunŏkkī
sadamai yīmelĕṁchi sanaviyyarādā

(||ninnum̐||)
sali ninnu niṭṭĕ kūḍĕ śhrīveṁkaḍeśham̐ḍavani
yĕlami nīvalasede yĕnnigā nīgu
palumāru nīgu mŏkki bāsalĕllam̐ jegŏnĕ
salamulu māni yiṭṭĕ sanaviyyavaladā