Ninnum baayamgalanaa neegeduraadenaa

నిన్నుఁ బాయఁగలనా నీకెదురాడేనా
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ బాయఁగలనా నీకెదురాడేనా
సన్నల చాయల నిన్ను జరసితిఁగాక

(॥॥)
వొడివట్టి పెనఁగఁగా నోపనంటే నేమందువు
అడరి మాయింటికి రావయ్యా నీవు
వెడ వెడ సతులను వెంటఁబెట్టుక రాఁగాను
తొడిఁబడ నే నూరకే దూరితిఁగాక

(॥॥)
చెక్కు నొక్కి వేఁడుకోఁగా సేయనంటే నేమందువు
అక్కరతో గూచుండవయ్యా నీవు
చొక్కుచుఁ బెరకాంతల సుద్దులు చెప్పుకొనఁగా
చక్కఁగా బొమ్మల నిన్ను జంకించితిఁగాక

(॥॥)
పొంచి కాఁగిటఁ గూడఁగా పొనిగితే నేమందువు
అంచెల నిట్టె మన్నించవయ్యా నీవు
యెంచఁగ నన్నేలి యేడో ఇంతులతోఁ జెప్పుకోఁగా
కొంచక శ్రీ వేంకటేశ కొసరితిఁగాక

(||pallavi||)
ninnum̐ bāyam̐galanā nīgĕdurāḍenā
sannala sāyala ninnu jarasidim̐gāga

(||||)
vŏḍivaṭṭi pĕnam̐gam̐gā nobanaṁṭe nemaṁduvu
aḍari māyiṁṭigi rāvayyā nīvu
vĕḍa vĕḍa sadulanu vĕṁṭam̐bĕṭṭuga rām̐gānu
tŏḍim̐baḍa ne nūrage dūridim̐gāga

(||||)
sĕkku nŏkki vem̐ḍugom̐gā seyanaṁṭe nemaṁduvu
akkarado gūsuṁḍavayyā nīvu
sŏkkusum̐ bĕragāṁtala suddulu sĕppugŏnam̐gā
sakkam̐gā bŏmmala ninnu jaṁkiṁchidim̐gāga

(||||)
pŏṁchi kām̐giḍam̐ gūḍam̐gā pŏnigide nemaṁduvu
aṁchĕla niṭṭĕ manniṁchavayyā nīvu
yĕṁcham̐ga nanneli yeḍo iṁtuladom̐ jĕppugom̐gā
kŏṁchaga śhrī veṁkaḍeśha kŏsaridim̐gāga