నిన్నుఁ బాసియు నీపతి నీవొద్ద నున్నాఁడ నంటా
(॥పల్లవి॥)
నిన్నుఁ బాసియు నీపతి నీవొద్ద నున్నాఁడ నంటా
పన్ని నీరూపు దలఁచి భావరతి సేయును
(॥నిన్ను॥)
పట్టెమంచముకోటిగుబ్బలు చన్నులంటా
పట్టి పట్టి చూచి మోమప్పళించుకొను
అట్టె చిన్నిమలగు అదియే నీ మేనంటా
బెట్టి కౌఁగిళించుకొని బిగియించు సారెకు
(॥నిన్ను॥)
మడిచి యిచ్చిన యాకు మగువ నీమోవి యంటా
పడఁతిచే నందుక చప్పరించును
ముడిచినమేలుకట్టు మొల్లలదండలు నీ
కడకంటి చూపులంటా ఘాతంబై పైఁ జూచును
(॥నిన్ను॥)
కప్పినదుప్పటికొంగు కాంత నీ పయ్యద యంటా
తప్పి తారి బలిమిని తన్నుఁ దానే తీసును
చెప్పరానిమోహముతో శ్రీవేంకటేశుఁడు గూడె
యిప్పుడిట్టె నీవు రాగా యిదె నిజమాయను
(||pallavi||)
ninnum̐ bāsiyu nībadi nīvŏdda nunnām̐ḍa naṁṭā
panni nīrūbu dalam̐si bhāvaradi seyunu
(||ninnu||)
paṭṭĕmaṁchamugoḍigubbalu sannulaṁṭā
paṭṭi paṭṭi sūsi momappaḽiṁchugŏnu
aṭṭĕ sinnimalagu adiye nī menaṁṭā
bĕṭṭi kaum̐giḽiṁchugŏni bigiyiṁchu sārĕgu
(||ninnu||)
maḍisi yichchina yāgu maguva nīmovi yaṁṭā
paḍam̐tise naṁduga sappariṁchunu
muḍisinamelugaṭṭu mŏllaladaṁḍalu nī
kaḍagaṁṭi sūbulaṁṭā ghādaṁbai paim̐ jūsunu
(||ninnu||)
kappinaduppaḍigŏṁgu kāṁta nī payyada yaṁṭā
tappi tāri balimini tannum̐ dāne tīsunu
sĕpparānimohamudo śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
yippuḍiṭṭĕ nīvu rāgā yidĕ nijamāyanu