Ninnum baasiyu nee padi neevaddanunnaamdanamtaa

నిన్నుఁ బాసియు నీ పతి నీవద్దనున్నాఁడనంటా
Language

(॥పల్లవి॥)
నిన్నుఁ బాసియు నీ పతి నీవద్దనున్నాఁడనంటా
పన్ని నీ రూపుదలఁచి భావరతి సేయును

(॥నిన్ను॥)
పట్టెమంచముకోటిగుబ్బలు నీచన్నులంటా
పట్టి పట్టిచూచి మోమప్పుళించుకొను
అట్టె చిన్నిమలగు అదియె నీమేనంటా
బెట్టి కాఁగలించుకొని బిగియించు సారెకు

(॥నిన్ను॥)
మడిచి యిచ్చినయాకు మగువ నీమోవంటా
పడఁతిచేనందుక చప్పరించును
ముడిచిన మేలుకట్టు మొల్లలదండలు నీ
కడగంటి చూపులంటా ఘాతఁ బైపైఁ జూచును

(॥నిన్ను॥)
కప్పిన దుప్పటికొంగు కాంత నీపయ్యదంటా
తప్పితారి బలిమిని తన్నుఁదానె తీసును
చెప్పరానిమోహముతో శ్రీ వేంకటేశుఁడు గూడె
యిప్పుడిట్టె నీవురాఁగా ఇదే నిజమాయను

(||pallavi||)
ninnum̐ bāsiyu nī padi nīvaddanunnām̐ḍanaṁṭā
panni nī rūbudalam̐si bhāvaradi seyunu

(||ninnu||)
paṭṭĕmaṁchamugoḍigubbalu nīsannulaṁṭā
paṭṭi paṭṭisūsi momappuḽiṁchugŏnu
aṭṭĕ sinnimalagu adiyĕ nīmenaṁṭā
bĕṭṭi kām̐galiṁchugŏni bigiyiṁchu sārĕgu

(||ninnu||)
maḍisi yichchinayāgu maguva nīmovaṁṭā
paḍam̐tisenaṁduga sappariṁchunu
muḍisina melugaṭṭu mŏllaladaṁḍalu nī
kaḍagaṁṭi sūbulaṁṭā ghādam̐ baibaim̐ jūsunu

(||ninnu||)
kappina duppaḍigŏṁgu kāṁta nībayyadaṁṭā
tappidāri balimini tannum̐dānĕ tīsunu
sĕpparānimohamudo śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
yippuḍiṭṭĕ nīvurām̐gā ide nijamāyanu