నిన్నుఁ బాసి రమణికి నిమిషమెందును నేఁడే
(॥పల్లవి॥)
నిన్నుఁ బాసి రమణికి నిమిషమెందును నేఁడే
మన్నించితి రమణుఁడ మా చెలిని నేఁడే
(॥॥)
చిత్తమెల్లా నీరాయ చెమట లేరులు వారె
యెత్తిన వానకాల మింతా నేఁడే
మొత్తమిఁ జెలితురుము మొయిలి విరిసె నిదె
హత్తి వెలుతురుఁగాల మది నేఁడే
(॥॥)
చలిసిగ్గులెల్ల ముంచె పులకలమంచు ముంచె
చలిమంచికాలాలు సతికి నేఁడే
తలఁపెల్లాఁ జిగిరించె తమకపుటెండ గాసె
వెలయు వసంతము వేసవియు నేఁడే
(॥॥)
పగడపు మోవివంటి పచ్చి వెచ్చికొండ నిండె
మొగి యామనికాలము మొదల నేఁడే
నిగిడి శ్రీ వేంకటటేశ నీవే యింతిఁ గూడితివి
బగివాయ నిద్దరికిఁ బండుగలు నేఁడే
(||pallavi||)
ninnum̐ bāsi ramaṇigi nimiṣhamĕṁdunu nem̐ḍe
manniṁchidi ramaṇum̐ḍa mā sĕlini nem̐ḍe
(||||)
sittamĕllā nīrāya sĕmaḍa lerulu vārĕ
yĕttina vānagāla miṁtā nem̐ḍe
mŏttamim̐ jĕlidurumu mŏyili virisĕ nidĕ
hatti vĕludurum̐gāla madi nem̐ḍe
(||||)
salisiggulĕlla muṁchĕ pulagalamaṁchu muṁchĕ
salimaṁchigālālu sadigi nem̐ḍe
talam̐pĕllām̐ jigiriṁchĕ tamagabuḍĕṁḍa gāsĕ
vĕlayu vasaṁtamu vesaviyu nem̐ḍe
(||||)
pagaḍabu movivaṁṭi pachchi vĕchchigŏṁḍa niṁḍĕ
mŏgi yāmanigālamu mŏdala nem̐ḍe
nigiḍi śhrī veṁkaḍaḍeśha nīve yiṁtim̐ gūḍidivi
bagivāya niddarigim̐ baṁḍugalu nem̐ḍe