Ninnu vesaarimcha nela nee daamkaa nela

నిన్ను వేసారించ నేల నీ దాఁకా నేల
Language

(॥పల్లవి॥)
నిన్ను వేసారించ నేల నీ దాఁకా నేల
మన్నించని వారికి నీ మహిమలే చాలు

(॥నిన్ను॥)
హరి నీ నామమే చాలు నందరిపాపాలు మాన్ప
సరి నాపద లడంచ చక్రమే చాలు
అరులఁ దెగటారుచునట్టి నీ స్మరణే చాలు
పర మొంగను నీపై భక్తియే చాలు

(॥నిన్ను॥)
దేవ నీ కథలే చాలు తెగి దుర్గుణాలు మాన్ప
మూ వంక కర్మము దీర్చ ముద్రలే చాలు
భావించి దుఁఖ ముడుప పాదతీర్థమే చాలు
కైవసమై రక్షించ నీ కైంకర్యమే చాలు

(॥నిన్ను॥)
సంతతసుఖ మియ్య నీ శరణాగతియే చాలు
చింత లెల్ల మానుప నీ సేవే చాలు
బంతినే యలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
అంతటికి నీ యభయహస్తమే చాలును

(||pallavi||)
ninnu vesāriṁcha nela nī dām̐kā nela
manniṁchani vārigi nī mahimale sālu

(||ninnu||)
hari nī nāmame sālu naṁdaribābālu mānpa
sari nābada laḍaṁcha sakrame sālu
arulam̐ dĕgaḍārusunaṭṭi nī smaraṇe sālu
para mŏṁganu nībai bhaktiye sālu

(||ninnu||)
deva nī kathale sālu tĕgi durguṇālu mānpa
mū vaṁka karmamu dīrsa mudrale sālu
bhāviṁchi dum̐kha muḍuba pādadīrdhame sālu
kaivasamai rakṣhiṁcha nī kaiṁkaryame sālu

(||ninnu||)
saṁtadasukha miyya nī śharaṇāgadiye sālu
siṁta lĕlla mānuba nī seve sālu
baṁtine yalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
aṁtaḍigi nī yabhayahastame sālunu