నిన్ను రమ్మని పిలువ నే మెంతవారము
(॥పల్లవి॥)
నిన్ను రమ్మని పిలువ నే మెంతవారము
కన్నులఁ జూచితే నీవే కరుణించేవయ్యా
(॥నిన్ను॥)
ఉప్పతిల్లుఁగోరికల నుడివోనికాతరాన
యెప్పుడు నీపొందులకే యేఁకరీఁజెలి
కప్పురగంది నీమీఁదఁగలిగినవలపులు
చెప్పఁగ వచ్చితి మిఁకఁ జిత్తగించవయ్యా
(॥నిన్ను॥)
వుదుటుఁదమకముల నొంటిని తలపోఁతల
యెదురుచూచి చూచి యేకరీఁజెలి
మదిరాక్షిభావ మిది మరఁగు మొరఁగు లేదు
మది నీవే తలఁచుక మన్నించవయ్యా
(॥నిన్ను॥)
పట్టరానిజవ్వనాన బయలీఁతయాసలను
యిట్టే నీరతులకు నేఁకరీఁ జెలి
నెట్టన శ్రీవేంకటేశ నీవు నేఁడు గూడితివి
చుట్టరికములు నీవే చూచుకొనవయ్యా
(||pallavi||)
ninnu rammani piluva ne mĕṁtavāramu
kannulam̐ jūside nīve karuṇiṁchevayyā
(||ninnu||)
uppadillum̐gorigala nuḍivonigādarāna
yĕppuḍu nībŏṁdulage yem̐karīm̐jĕli
kappuragaṁdi nīmīm̐dam̐galiginavalabulu
sĕppam̐ga vachchidi mim̐kam̐ jittagiṁchavayyā
(||ninnu||)
vuduḍum̐damagamula nŏṁṭini talabom̐tala
yĕdurusūsi sūsi yegarīm̐jĕli
madirākṣhibhāva midi maram̐gu mŏram̐gu ledu
madi nīve talam̐suga manniṁchavayyā
(||ninnu||)
paṭṭarānijavvanāna bayalīm̐tayāsalanu
yiṭṭe nīradulagu nem̐karīm̐ jĕli
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvu nem̐ḍu gūḍidivi
suṭṭarigamulu nīve sūsugŏnavayyā