నిన్ను నిఁక నేమందు నన్ను నే దూరుటగాక
(॥పల్లవి॥)
నిన్ను నిఁక నేమందు నన్ను నే దూరుటగాక
కన్నుల నవ్వు నవ్వేవు ఘనమైన మోహమా
(॥నిన్ను॥)
చిగురునామోవిగంటి చిత్తగించి చూడవయ్య
యెగసక్కేలకు నీవే యెంతసేసితి
తగిలి సారెకు రాఁగా తెగి ఇటువలె నీవు
ఆగడుసేసితిగాక అది నాపై మోహమా
(॥నిన్ను॥)
జాడల నాచన్నులపై చందురులఁ జూడవయ్య
యేడలేనిచలముల ఇంతసేసితి
వేడుకై వద్దనుండఁగా వేసరి ఇందరిచేత
ఆడుకోఁజేసేవుగాక అది నాపై మోహమ
(॥నిన్ను॥)
వుమ్మడి నాముంజేతులకుమ్మెలిటు చూడవయ్యా
యెమ్మెల నీకూటముల యింతసేసితి
నెమ్మది శ్రీవేంకటేశ నీకాఁగిటఁ జొక్కితేను
అమ్ముద్ర నించేవుగాక అది నాపై మోహమా
(||pallavi||)
ninnu nim̐ka nemaṁdu nannu ne dūruḍagāga
kannula navvu navvevu ghanamaina mohamā
(||ninnu||)
sigurunāmovigaṁṭi sittagiṁchi sūḍavayya
yĕgasakkelagu nīve yĕṁtasesidi
tagili sārĕgu rām̐gā tĕgi iḍuvalĕ nīvu
āgaḍusesidigāga adi nābai mohamā
(||ninnu||)
jāḍala nāsannulabai saṁdurulam̐ jūḍavayya
yeḍalenisalamula iṁtasesidi
veḍugai vaddanuṁḍam̐gā vesari iṁdariseda
āḍugom̐jesevugāga adi nābai mohama
(||ninnu||)
vummaḍi nāmuṁjedulagummĕliḍu sūḍavayyā
yĕmmĕla nīgūḍamula yiṁtasesidi
nĕmmadi śhrīveṁkaḍeśha nīgām̐giḍam̐ jŏkkidenu
ammudra niṁchevugāga adi nābai mohamā