Ninnu nimdugumgaa vatti neramu lemchamga nela

నిన్ను నిందుకుఁగా వట్టి నేరము లెంచఁగ నేల
Language

(॥పల్లవి॥)
నిన్ను నిందుకుఁగా వట్టి నేరము లెంచఁగ నేల
మన్నించి నీ వివియైనా మానుపఁగా రాదుగా

(॥నిన్ను॥)
వూరకే న న్నొల్లక నీ వుండినా నీ యాలి నని
పేరు చెప్పఁ గద్దుగా నేఁ బ్రేమతోడను
తేరకొన నీవు నాదిక్కు చూడకుండినాను
దూరాన నిన్నుఁ జూచి సంతోసించ గద్దుగా

(॥నిన్ను॥)
మాని నీవు సముకాన మాటలాడకుండినాను
వీనుల నీ చరితలు విందుఁగా నేను
చే నంటి పాదాలు సేద సేయ నియ్యకుండినాను
దానికి నా మనసులోఁ దలపోయఁ గద్దుగా

(॥నిన్ను॥)
గట్టిగా నే మొక్కితేను కరుణించకున్నా నీవు
గట్టినతాళి నామెడ గద్దుగా నాకు
యిట్టే శ్రీవేంకటేశ యేలితి వింతలో నన్ను
యెట్టయినా జుట్టిరిక మెపుడునుఁ గద్దుగా

(||pallavi||)
ninnu niṁdugum̐gā vaṭṭi neramu lĕṁcham̐ga nela
manniṁchi nī viviyainā mānubam̐gā rādugā

(||ninnu||)
vūrage na nnŏllaga nī vuṁḍinā nī yāli nani
peru sĕppam̐ gaddugā nem̐ bremadoḍanu
teragŏna nīvu nādikku sūḍaguṁḍinānu
dūrāna ninnum̐ jūsi saṁtosiṁcha gaddugā

(||ninnu||)
māni nīvu samugāna māḍalāḍaguṁḍinānu
vīnula nī saridalu viṁdum̐gā nenu
se naṁṭi pādālu seda seya niyyaguṁḍinānu
dānigi nā manasulom̐ dalaboyam̐ gaddugā

(||ninnu||)
gaṭṭigā ne mŏkkidenu karuṇiṁchagunnā nīvu
gaṭṭinadāḽi nāmĕḍa gaddugā nāgu
yiṭṭe śhrīveṁkaḍeśha yelidi viṁtalo nannu
yĕṭṭayinā juṭṭiriga mĕbuḍunum̐ gaddugā