Ninnu nemu gaadanemaa nimdudoravu

నిన్ను నేము గాదనేమా నిండుదొరవు
Language

(॥పల్లవి॥)
నిన్ను నేము గాదనేమా నిండుదొరవు
సన్నతో మెలఁగేటి యిచ్చకురాల నేను

(॥నిన్ను॥)
మొగము చూచితేను మోము వంచేవు
నగితే నీకు నీవే యానలు వెట్టేవు
మగవారికేఁటికి మరి వెరవు
అగపడ సతులను అలమఁగరాదా

(॥నిన్ను॥)
పనివడి మెచ్చితేనే బ్రమసేవు
తనువుపైఁ జేయి వేసితే తత్తరించేవు
యెనసి పాయపువానికేల నేమాలు
కనుఁగొన్న చెలులనుఁ గలయఁగరాదా

(॥నిన్ను॥)
వూరకే మోవి యానితే నులికేవు
ఆరసి నిన్నుఁ గూడఁగ నలసేవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి
పోరచి కాంతలనెల్ల భోగించరాదా

(||pallavi||)
ninnu nemu gādanemā niṁḍudŏravu
sannado mĕlam̐geḍi yichchagurāla nenu

(||ninnu||)
mŏgamu sūsidenu momu vaṁchevu
nagide nīgu nīve yānalu vĕṭṭevu
magavārigem̐ṭigi mari vĕravu
agabaḍa sadulanu alamam̐garādā

(||ninnu||)
panivaḍi mĕchchidene bramasevu
tanuvubaim̐ jeyi veside tattariṁchevu
yĕnasi pāyabuvānigela nemālu
kanum̐gŏnna sĕlulanum̐ galayam̐garādā

(||ninnu||)
vūrage movi yānide nuligevu
ārasi ninnum̐ gūḍam̐ga nalasevu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi
porasi kāṁtalanĕlla bhogiṁcharādā