నిన్ను నేమీ ననలేక నివ్వెరగందితిఁ గాక
(॥పల్లవి॥)
నిన్ను నేమీ ననలేక నివ్వెరగందితిఁ గాక
యిన్నేసి వగలఁ బెట్ట ఇతవా నీకు
(॥నిన్ను॥)
పువ్వులవేసినవారిఁ బూచి రాత వేయలెక
నవ్వఁగనే నీతో నే నవ్వేఁగాక
నివ్వటిల్లువలపుల నిట్టూర్పు లివె మించీఁ
జవ్వనాన ననుఁ బాయఁ జలమా నీకు
(॥నిన్ను॥)
వెన్నవూసినట్టివారి వెలిమిడి వూయలేక
పన్ని నీవు పలుకఁగఁ బలికేఁగాని
కన్నుల నీళ్లు దొట్టి కాఁకలు మేన నిండె
వన్నెలనన్నింత సేయ వ్రతమా నీకు
(॥నిన్ను॥)
చెట్టవట్టి తియ్యఁగాను చేసన్న నేయఁగలేక
గుట్టుతో నీవు గూడఁగఁ గూడితిఁగాని
అట్టె శ్రీవేంకటేశ అరమఱపాయ మేను
చుట్టమై ఇంతసేయ సూడా నీకు
(||pallavi||)
ninnu nemī nanalega nivvĕragaṁdidim̐ gāga
yinnesi vagalam̐ bĕṭṭa idavā nīgu
(||ninnu||)
puvvulavesinavārim̐ būsi rāda veyalĕga
navvam̐gane nīdo ne navvem̐gāga
nivvaḍilluvalabula niṭṭūrbu livĕ miṁchīm̐
javvanāna nanum̐ bāyam̐ jalamā nīgu
(||ninnu||)
vĕnnavūsinaṭṭivāri vĕlimiḍi vūyalega
panni nīvu palugam̐gam̐ baligem̐gāni
kannula nīḽlu dŏṭṭi kām̐kalu mena niṁḍĕ
vannĕlananniṁta seya vradamā nīgu
(||ninnu||)
sĕṭṭavaṭṭi tiyyam̐gānu sesanna neyam̐galega
guṭṭudo nīvu gūḍam̐gam̐ gūḍidim̐gāni
aṭṭĕ śhrīveṁkaḍeśha aramaṟabāya menu
suṭṭamai iṁtaseya sūḍā nīgu