Ninnu nemchi soosidenu neegu nevvaru sari

నిన్ను నెంచి చూచితేను నీకు నెవ్వరు సరి
Language

(॥పల్లవి॥)
నిన్ను నెంచి చూచితేను నీకు నెవ్వరు సరి
మన్నించె నీ రమణుఁడు మరియేల కొంకను

(॥నిన్ను॥)
వనిత నీ జవ్వనము వలపుల కొటారు
పనుపడ్డ తుమ్మెదపాళము కొప్పు
గొనకొన్న గండుమీల కొలఁకులు కన్నులు
మనసిజ బలాలు నీమహిమలే కదవే

(॥నిన్ను॥)
జలజాక్షి నీవురము చక్రవాకములు రచ్చ
మలయుఁ జల్లగాలికి మనికి ముక్కు
పలుకుఁ జిలుకలకు పంజరము నీనోరు
బలుమరు బలాలు నీ భావములే కదవే

(॥నిన్ను॥)
అలమేలుమంగ నీమో మలచందురుని గీము
తళుపు మైసింగారాల దాఁపరము
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
వలరాచబలాలు నీవసమే కదవే

(||pallavi||)
ninnu nĕṁchi sūsidenu nīgu nĕvvaru sari
manniṁchĕ nī ramaṇum̐ḍu mariyela kŏṁkanu

(||ninnu||)
vanida nī javvanamu valabula kŏḍāru
panubaḍḍa tummĕdabāḽamu kŏppu
gŏnagŏnna gaṁḍumīla kŏlam̐kulu kannulu
manasija balālu nīmahimale kadave

(||ninnu||)
jalajākṣhi nīvuramu sakravāgamulu rachcha
malayum̐ jallagāligi manigi mukku
palugum̐ jilugalagu paṁjaramu nīnoru
balumaru balālu nī bhāvamule kadave

(||ninnu||)
alamelumaṁga nīmo malasaṁduruni gīmu
taḽubu maisiṁgārāla dām̐paramu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
valarāsabalālu nīvasame kadave