నిన్ను నేమనఁగలను నీకు సహజ మివెల్ల
(॥పల్లవి॥)
నిన్ను నేమనఁగలను నీకు సహజ మివెల్ల
చెన్నగు నా వలపింత సేసెననేఁ గాక
(॥నిన్ను॥)
వీడనాడఁజెల్లదా వింతనీమైతావి చూచి
వీడనాడలనినోరు వీరిడిగాక
చూడకుండఁజెల్లదా సూటి నాకెతో నుండఁగా
చూడఁబోయేచంచలపు చూపుల ననేఁగాక
(॥నిన్ను॥)
ఆలుగఁజెల్లదా నీమై యాచెమట చూచైనా
ఆలుగనినాగుణము వెలితిగాక
తలఁచకుండఁ జెల్లదా తప్పు నీ బాసలు చూచి
తలఁచేటి నామనసుతమి ననేఁగాక
(॥నిన్ను॥)
తారుకాణించఁజెల్లదా తగునీసుద్దులు విని
తారుకాణించలేనినాదయ గాక
యీరీతి శ్రీవేంకటేశ ఇప్పుడే నన్నేలితివి
ఆరయ వేగిరించేనా ఆస నఁనేగాక
(||pallavi||)
ninnu nemanam̐galanu nīgu sahaja mivĕlla
sĕnnagu nā valabiṁta sesĕnanem̐ gāga
(||ninnu||)
vīḍanāḍam̐jĕlladā viṁtanīmaidāvi sūsi
vīḍanāḍalaninoru vīriḍigāga
sūḍaguṁḍam̐jĕlladā sūḍi nāgĕdo nuṁḍam̐gā
sūḍam̐boyesaṁchalabu sūbula nanem̐gāga
(||ninnu||)
ālugam̐jĕlladā nīmai yāsĕmaḍa sūsainā
āluganināguṇamu vĕlidigāga
talam̐saguṁḍam̐ jĕlladā tappu nī bāsalu sūsi
talam̐seḍi nāmanasudami nanem̐gāga
(||ninnu||)
tārugāṇiṁcham̐jĕlladā tagunīsuddulu vini
tārugāṇiṁchaleninādaya gāga
yīrīdi śhrīveṁkaḍeśha ippuḍe nannelidivi
āraya vegiriṁchenā āsa nam̐negāga