నిన్ను నీవెఱఁగలేవు నేరుపు లేమిచూపేవే
(॥పల్లవి॥)
నిన్ను నీవెఱఁగలేవు నేరుపు లేమిచూపేవే
చన్నులమీఁది పయ్యద చక్కఁబెట్టుకోరాదా
(॥నిన్ను॥)
సారె నాతనితో నెంత సరసములాడేవే
జారుఁగోప్పు ముడుచుకో చక్కఁగా నీవు
కేరికేరి యెందాఁకా కిలకిల నవ్వేవే
కారేటిచెక్కుచెమట కడుగుకోరాదా
(॥నిన్ను॥)
దాకోని యాతనిమోము తప్పకేమి చూచేవే
కోక చక్కఁగట్టుకో గుట్టుతో నీవు
కాకరితనముతోడ కతలేమి చెప్పేవే
తూకొని తమ్మబేంట్లు తుడుచుకొరాదా
(॥నిన్ను॥)
బలిమి వొద్దఁగూచుండి పాదా లేమిగుద్దేవే
అలపు దీరుచుకొ అంతలో నీవు
అలమేల్‌మంగను నేను ఆతఁడు శ్రీవేంకటేశుఁ-
డలమె నన్నిఁక నీవు నండనే కూడరాదా
(||pallavi||)
ninnu nīvĕṟam̐galevu nerubu lemisūbeve
sannulamīm̐di payyada sakkam̐bĕṭṭugorādā
(||ninnu||)
sārĕ nādanido nĕṁta sarasamulāḍeve
jārum̐goppu muḍusugo sakkam̐gā nīvu
kerigeri yĕṁdām̐kā kilagila navveve
kāreḍisĕkkusĕmaḍa kaḍugugorādā
(||ninnu||)
dāgoni yādanimomu tappagemi sūseve
koga sakkam̐gaṭṭugo guṭṭudo nīvu
kāgaridanamudoḍa kadalemi sĕppeve
tūgŏni tammabeṁṭlu tuḍusugŏrādā
(||ninnu||)
balimi vŏddam̐gūsuṁḍi pādā lemiguddeve
alabu dīrusugŏ aṁtalo nīvu
alamelmaṁganu nenu ādam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍalamĕ nannim̐ka nīvu naṁḍane kūḍarādā