నిన్ను నాపెఁ జూచితేను నేఁడు నాకు వెరగయ్యీ
(॥పల్లవి॥)
నిన్ను నాపెఁ జూచితేను నేఁడు నాకు వెరగయ్యీ
యిన్నిటా నీ మతకము లెంచుకోవయ్యా
(॥నిన్ను॥)
కాంత యెవ్వతోకాని కాచుకున్నది వాకిట
మంతనానకుఁ బిలిచి మాఁటాడవయ్యా
వంతులకు నీతోడివావు లందరికిఁ జెప్పీ
యెంత చుట్టమో అది యెరుఁగు కోవయ్యా
(॥నిన్ను॥)
చెలిమి నీతోఁ దాను సేసెనట యెన్నఁడో
లలి నీ వది యట్టె తలఁచుకోవయ్యా
అలరి నీవిచ్చినట్టి అడియాలములుఁ జూపీ
పిలిచి నీ పీఁటమీఁద బెట్టుకోవయ్యా
(॥నిన్ను॥)
చెప్పి పంపితివట యే చెలియచేతనో రమ్మని
యిప్పడే యాపనులు సేయించుకోవయ్యా
అప్పఁడ శ్రీవేంకటేశ యలమ్మేల్మంగను నేను
నెప్పున నన్నేలితివి నీవాకెఁ గూడవయ్యా
(||pallavi||)
ninnu nābĕm̐ jūsidenu nem̐ḍu nāgu vĕragayyī
yinniḍā nī madagamu lĕṁchugovayyā
(||ninnu||)
kāṁta yĕvvadogāni kāsugunnadi vāgiḍa
maṁtanānagum̐ bilisi mām̐ṭāḍavayyā
vaṁtulagu nīdoḍivāvu laṁdarigim̐ jĕppī
yĕṁta suṭṭamo adi yĕrum̐gu kovayyā
(||ninnu||)
sĕlimi nīdom̐ dānu sesĕnaḍa yĕnnam̐ḍo
lali nī vadi yaṭṭĕ talam̐sugovayyā
alari nīvichchinaṭṭi aḍiyālamulum̐ jūbī
pilisi nī pīm̐ṭamīm̐da bĕṭṭugovayyā
(||ninnu||)
sĕppi paṁpidivaḍa ye sĕliyasedano rammani
yippaḍe yābanulu seyiṁchugovayyā
appam̐ḍa śhrīveṁkaḍeśha yalammelmaṁganu nenu
nĕppuna nannelidivi nīvāgĕm̐ gūḍavayyā