నిన్ను మెత్తునో యీపె నేరుపులు మెత్తునో
(॥పల్లవి॥)
నిన్ను మెత్తునో యీపె నేరుపులు మెత్తునో
యిన్నియు మీకే తగు నేమందు నేను
(॥నిన్ను॥)
మట్టులేక చేటెఁడేసి మాఁట లాపె యాడఁగాను
వెట్టికి వేసటలేక వినేవు నీవు
పట్టెడంతలు గుబ్బలు పయ్యెదలోఁ జూపఁగాను
చుట్టి చుట్టి రెప్పలెత్తి చూచేవు నీవు
(॥నిన్ను॥)
పొంచి వావు లీపె నీతో పోఁకకుఁ బుట్టెఁ డమ్మఁగా
వంచక యాసలాసలఁ గూడ పెట్టేవు
కంచపుమోవితేనెలు కానుక నీకియ్యఁగాను
అంచలను చొక్కి చొక్కి యందుకే నోరూరేవు
(॥నిన్ను॥)
సారెఁ జీరునగవుల జాజర పైఁ జల్లఁగాను
వూరకే వెరగువడి వుమ్మగిలేవు
యీరీతి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
మేరతో నిన్నుఁ గూడఁగా మెచ్చేవు నీవు
(||pallavi||)
ninnu mĕttuno yībĕ nerubulu mĕttuno
yinniyu mīge tagu nemaṁdu nenu
(||ninnu||)
maṭṭulega seḍĕm̐ḍesi mām̐ṭa lābĕ yāḍam̐gānu
vĕṭṭigi vesaḍalega vinevu nīvu
paṭṭĕḍaṁtalu gubbalu payyĕdalom̐ jūbam̐gānu
suṭṭi suṭṭi rĕppalĕtti sūsevu nīvu
(||ninnu||)
pŏṁchi vāvu lībĕ nīdo pom̐kagum̐ buṭṭĕm̐ ḍammam̐gā
vaṁchaga yāsalāsalam̐ gūḍa pĕṭṭevu
kaṁchabumovidenĕlu kānuga nīgiyyam̐gānu
aṁchalanu sŏkki sŏkki yaṁduge norūrevu
(||ninnu||)
sārĕm̐ jīrunagavula jājara paim̐ jallam̐gānu
vūrage vĕraguvaḍi vummagilevu
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
merado ninnum̐ gūḍam̐gā mĕchchevu nīvu