Ninnu mettumo yaabe nerubulu mettumo

నిన్ను మెత్తుమో యాపె నేరుపులు మెత్తుమో
Language

(॥పల్లవి॥)
నిన్ను మెత్తుమో యాపె నేరుపులు మెత్తుమో
చెన్నుగా మాకేది బుద్ది చెప్పవయ్యా ఇఁకను

(॥నిన్ను॥)
ఇంతి నీవు వచ్చేవంటా నిందాఁకా పందేలు వేసె
నంతలోనే వచ్చితివి ఆయ నిజము
అంతటి నీ వొడఁబా ట్లాపెకు నీకు నెట్టివో
చెంతఁ దారుకాణలు వచ్చెను మాకిందరికి

(॥నిన్ను॥)
ఇచ్చేవు సొమ్ములంటాను ఇందరికి సాకికి వెట్టె
తెచ్చితి వవియుఁ దేట తెల్లమాయను
మెచ్చుల మీ సన్నలు మీలో మీకే తెలుసును
అచ్చపు మీచేఁత లొక్కటాయ మాకిందరికి

(॥నిన్ను॥)
తనకే వలతునని తప్పని బాసలు చెప్పె
చెనకి కూడితి విట్టె చెల్లెఁ బంతము
తనిసి శ్రీవేంకటేశ తగులాయ మిద్దరికి
ఇనుమడించె సంతోసా లిట్టె మాకిందరికి

(||pallavi||)
ninnu mĕttumo yābĕ nerubulu mĕttumo
sĕnnugā māgedi buddi sĕppavayyā im̐kanu

(||ninnu||)
iṁti nīvu vachchevaṁṭā niṁdām̐kā paṁdelu vesĕ
naṁtalone vachchidivi āya nijamu
aṁtaḍi nī vŏḍam̐bā ṭlābĕgu nīgu nĕṭṭivo
sĕṁtam̐ dārugāṇalu vachchĕnu māgiṁdarigi

(||ninnu||)
ichchevu sŏmmulaṁṭānu iṁdarigi sāgigi vĕṭṭĕ
tĕchchidi vaviyum̐ deḍa tĕllamāyanu
mĕchchula mī sannalu mīlo mīge tĕlusunu
achchabu mīsem̐ta lŏkkaḍāya māgiṁdarigi

(||ninnu||)
tanage valadunani tappani bāsalu sĕppĕ
sĕnagi kūḍidi viṭṭĕ sĕllĕm̐ baṁtamu
tanisi śhrīveṁkaḍeśha tagulāya middarigi
inumaḍiṁchĕ saṁtosā liṭṭĕ māgiṁdarigi