నిన్ను మీర నోపను నే నెటువలె నుండిన
(॥పల్లవి॥)
నిన్ను మీర నోపను నే నెటువలె నుండిన
అన్నిటా నే నీకె లో నవుతే నా తగవూ
(॥నిన్ను॥)
యెంత విరహవేదన నెట్లా నేఁ బొరలినా
రంతుల వేగిరించఁగ రాదు నిన్ను
యింతకంటే నీతో నే నెంత వొట్టు వెట్టుకొన్న
వంతలు నీయంకెలకు వచ్చుటే నాతగవు
(॥నిన్ను॥)
ముంచి నాకు నీమీఁద మోహ మెంత యెక్కు డైన
చంచలించి వేగరించ సంగతా నాకు
మంచితనాననే నీకు ముందెమేళ మెంతయిన
పొంచి నీవేళ గాచుక పొందుటే నాతగవూ
(॥నిన్ను॥)
వరుసతో నే నీకు వద్ద నిట్టే వుండినాను
గరిమె నే ముందు చెనకఁగఁ జెల్లునా
నిరతి శ్రీవెంకటేశ నీవే నన్నుఁ గూడితిని
ధరమీఁది పనులకుఁ దాలిమే నాతగవూ
(||pallavi||)
ninnu mīra nobanu ne nĕḍuvalĕ nuṁḍina
anniḍā ne nīgĕ lo navude nā tagavū
(||ninnu||)
yĕṁta virahavedana nĕṭlā nem̐ bŏralinā
raṁtula vegiriṁcham̐ga rādu ninnu
yiṁtagaṁṭe nīdo ne nĕṁta vŏṭṭu vĕṭṭugŏnna
vaṁtalu nīyaṁkĕlagu vachchuḍe nādagavu
(||ninnu||)
muṁchi nāgu nīmīm̐da moha mĕṁta yĕkku ḍaina
saṁchaliṁchi vegariṁcha saṁgadā nāgu
maṁchidanānane nīgu muṁdĕmeḽa mĕṁtayina
pŏṁchi nīveḽa gāsuga pŏṁduḍe nādagavū
(||ninnu||)
varusado ne nīgu vadda niṭṭe vuṁḍinānu
garimĕ ne muṁdu sĕnagam̐gam̐ jĕllunā
niradi śhrīvĕṁkaḍeśha nīve nannum̐ gūḍidini
dharamīm̐di panulagum̐ dālime nādagavū