నిన్ను మెచ్చుకొనేవో నా నేరుపు మెచ్చేవో కాని
(॥పల్లవి॥)
నిన్ను మెచ్చుకొనేవో నా నేరుపు మెచ్చేవో కాని
పన్ని నీవూడిగానకు ప్రౌఢఁ జుమ్మీ విభుఁడ
(॥నిన్ను॥)
చెక్కులు నీవు నొక్కఁగ చిత్తము గరఁగెఁ గాక
యెక్కువ కోప మెం తందు నిందాఁకను
తక్కరీఁడవు నౌదువు తగవరిని నౌదువు
చక్కఁ జాయకు రా నేను జాణఁ జుమ్మీ విభుఁడ
(॥నిన్ను॥)
బాసలు నీవు సేయఁగఁ బరిణామ మాయఁ గాక
యీసు నీపై నే మందు నిందాఁకను
ఆస చూప నెరుఁగుదు ఆదరించ నెరుఁగదు
రాసి కెక్క నీ కిచ్చకురాలఁ జుమ్మీ విభుఁడ
(॥నిన్ను॥)
మచ్చిక నీవు గూడఁగ మరి నే లో నైతిఁ గాక
యెచ్చుకుందు లెంచుకోవా యిందాఁకను
అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
తచ్చి కూడితిని మేలుదానఁ జుమ్మీ విభుఁడా
(||pallavi||)
ninnu mĕchchugŏnevo nā nerubu mĕchchevo kāni
panni nīvūḍigānagu prauḍham̐ jummī vibhum̐ḍa
(||ninnu||)
sĕkkulu nīvu nŏkkam̐ga sittamu garam̐gĕm̐ gāga
yĕkkuva koba mĕṁ taṁdu niṁdām̐kanu
takkarīm̐ḍavu nauduvu tagavarini nauduvu
sakkam̐ jāyagu rā nenu jāṇam̐ jummī vibhum̐ḍa
(||ninnu||)
bāsalu nīvu seyam̐gam̐ bariṇāma māyam̐ gāga
yīsu nībai ne maṁdu niṁdām̐kanu
āsa sūba nĕrum̐gudu ādariṁcha nĕrum̐gadu
rāsi kĕkka nī kichchagurālam̐ jummī vibhum̐ḍa
(||ninnu||)
machchiga nīvu gūḍam̐ga mari ne lo naidim̐ gāga
yĕchchuguṁdu lĕṁchugovā yiṁdām̐kanu
achchabu śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
tachchi kūḍidini meludānam̐ jummī vibhum̐ḍā