నిన్ను మెచ్చి పొగడేము నీ చెలులము గనక
(॥పల్లవి॥)
నిన్ను మెచ్చి పొగడేము నీ చెలులము గనక
యెన్నిక కెక్కితివమ్మా యిన్నిటాను నీవు
(॥నిన్ను॥)
వినయాలు నేరుతూవే విభుని వలపించను
పెనఁగ నేరుతువే ప్రియము రేఁచ
చెనకఁగ నేరుతువే చిత్తమేల్లాఁ గరఁగించ
మినుకుల జవరాల మేలు మేలే నీవు
(॥నిన్ను॥)
సన్నసేయ నేరుతువే సరసుని రప్పించ
విన్నవించ నేరుతువే వేడుకవుట్ట
కన్నులార్చ నేరుతువే కడు నిచ్చకముగాఁగ
అన్నిటా జాణకత్తెవు అవునౌనే నీవు
(॥నిన్ను॥)
సేసవెట్ట నేరుతువే శ్రీవేంకటేశుఁ జొక్కించ
ఆసచూప నేరుతువే ఆయలు సోఁక
రాసికెక్క నిన్ను నేలె రమణుఁ డితఁడె వచ్చి
బాసతోడి యిల్లాల బాపు బాపు నీవు
(||pallavi||)
ninnu mĕchchi pŏgaḍemu nī sĕlulamu ganaga
yĕnniga kĕkkidivammā yinniḍānu nīvu
(||ninnu||)
vinayālu nerudūve vibhuni valabiṁchanu
pĕnam̐ga neruduve priyamu rem̐sa
sĕnagam̐ga neruduve sittamellām̐ garam̐giṁcha
minugula javarāla melu mele nīvu
(||ninnu||)
sannaseya neruduve sarasuni rappiṁcha
vinnaviṁcha neruduve veḍugavuṭṭa
kannulārsa neruduve kaḍu nichchagamugām̐ga
anniḍā jāṇagattĕvu avunaune nīvu
(||ninnu||)
sesavĕṭṭa neruduve śhrīveṁkaḍeśhum̐ jŏkkiṁcha
āsasūba neruduve āyalu som̐ka
rāsigĕkka ninnu nelĕ ramaṇum̐ ḍidam̐ḍĕ vachchi
bāsadoḍi yillāla bābu bābu nīvu