నిన్ను మెచ్చఁగలఁ గాని నిష్టూరాన కోపను
(॥పల్లవి॥)
నిన్ను మెచ్చఁగలఁ గాని నిష్టూరాన కోపను
నిన్నటివలెనే నేఁడు నిల్పఁగరాదా
(॥నిన్ను॥)
యెన్ని లేవు నీసుద్దులు యిప్పుడు చెప్పేనంటేను
వున్నతి మొకదాకిరి నుందానఁగాక
పన్ని యప్పటి నాతో బాసలేల సేసేవు
యెన్నఁగ గుట్టుతో నుండనియ్యఁగరాదా
(॥నిన్ను॥)
నాకుఁ గొత్తా నీసేఁతలు నమ్మి ఇయ్యకొనేనంటే
చేకొని వెల్లావిరులు సేయఁగాక
సాకిరేల తెలిసేవు సతులనందరిఁ దెచ్చి
తూకొని తొల్లిటివెల్లా దొంతిఁబెట్టేవు
(॥నిన్ను॥)
కానరావా నీగుణాలు కమ్మటిఁ బొగడేనంటే
నానఁబెట్టి కొంతగొంత నవ్వేఁగాక
పూని శ్రీవేంకటేశుఁడ పొందితివి దూరనేల
మాని పంతమిచ్చితిని మన్నించరాదా
(||pallavi||)
ninnu mĕchcham̐galam̐ gāni niṣhṭūrāna kobanu
ninnaḍivalĕne nem̐ḍu nilbam̐garādā
(||ninnu||)
yĕnni levu nīsuddulu yippuḍu sĕppenaṁṭenu
vunnadi mŏgadāgiri nuṁdānam̐gāga
panni yappaḍi nādo bāsalela sesevu
yĕnnam̐ga guṭṭudo nuṁḍaniyyam̐garādā
(||ninnu||)
nāgum̐ gŏttā nīsem̐talu nammi iyyagŏnenaṁṭe
segŏni vĕllāvirulu seyam̐gāga
sāgirela tĕlisevu sadulanaṁdarim̐ dĕchchi
tūgŏni tŏlliḍivĕllā dŏṁtim̐bĕṭṭevu
(||ninnu||)
kānarāvā nīguṇālu kammaḍim̐ bŏgaḍenaṁṭe
nānam̐bĕṭṭi kŏṁtagŏṁta navvem̐gāga
pūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏṁdidivi dūranela
māni paṁtamichchidini manniṁcharādā