నిన్ను గెలువ వసమా నీ వింతటివాఁడవు
(॥పల్లవి॥)
నిన్ను గెలువ వసమా నీ వింతటివాఁడవు
మన్నించవయ్యా నే నీ మరఁగు చొచ్చితివి
(॥నిన్ను॥)
బలువాఁడ వౌదువు పడఁతు లెందరైనాను
సొలసితిట్టినా నోరుచుకవుందువు
మెలుపునీగుణాలకు మెచ్చితి నిందరిలోన
బలిమిఁ బదారువేల పాదముల సోఁకెను
(॥నిన్ను॥)
యెంతలేదు నీమహిమ యెంచి చూడ నిప్పుడిట్టె
కాంతలకెల్లా నీమోవి వకంచమాయను
వింతలాయ నీబతుకు వేడుకఁ బీతాంబరము
బంతినే గోపికలకుఁ బరపాయను
(॥నిన్ను॥)
మేలుమేలు నీపొదు మెరవడికత్తెలకు
వాలాయము వరుసలువంతులాయను
యీలీల శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
నీలాడు లిందరికిక కానికాలాయను
(||pallavi||)
ninnu gĕluva vasamā nī viṁtaḍivām̐ḍavu
manniṁchavayyā ne nī maram̐gu sŏchchidivi
(||ninnu||)
baluvām̐ḍa vauduvu paḍam̐tu lĕṁdarainānu
sŏlasidiṭṭinā norusugavuṁduvu
mĕlubunīguṇālagu mĕchchidi niṁdarilona
balimim̐ badāruvela pādamula som̐kĕnu
(||ninnu||)
yĕṁtaledu nīmahima yĕṁchi sūḍa nippuḍiṭṭĕ
kāṁtalagĕllā nīmovi vagaṁchamāyanu
viṁtalāya nībadugu veḍugam̐ bīdāṁbaramu
baṁtine gobigalagum̐ barabāyanu
(||ninnu||)
melumelu nībŏdu mĕravaḍigattĕlagu
vālāyamu varusaluvaṁtulāyanu
yīlīla śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
nīlāḍu liṁdarigiga kānigālāyanu