Ninnu dooram baniledu neevu mele sesidivi

నిన్ను దూరఁ బనిలేదు నీవు మేలే సేసితివి
Language

(॥పల్లవి॥)
నిన్ను దూరఁ బనిలేదు నీవు మేలే సేసితివి
కన్నెకుఁ గాఁకలు మించెఁ గర్మఫల మిట్టిది

(॥॥)
కాంతపై జల్లనిచూపు కడు నీవు చల్లఁగాను
యింతికిఁ జింతలత లిగిరించెను
కొంత నీకృపారసము కొలఁగులై ముంచఁగాను
వింతగాఁ గలువ లట్టె వికసించెను

(॥॥)
నెలఁతకుఁబలుకుఁదేనెలు నీవు చిందఁగాను
అలులు చిందరవందరై మూఁగెను
కలికిపై నీవూర్పుగాలి నేఁడు విసరఁగ
మలిమి జక్కవలకు పంజరము లూడెను

(॥॥)
పై పైఁ జెమటయేరు పడఁతిపై బరపఁగ
మోపులై ముత్తెపుసరులు మొలకలొత్తె
యేపున శ్రీ వేంకటేశ యీసతి నీవు గూడఁగ
నీపొందుల భ్రమసి నివ్పెరగై నిలిచె

(||pallavi||)
ninnu dūram̐ baniledu nīvu mele sesidivi
kannĕgum̐ gām̐kalu miṁchĕm̐ garmaphala miṭṭidi

(||||)
kāṁtabai jallanisūbu kaḍu nīvu sallam̐gānu
yiṁtigim̐ jiṁtalada ligiriṁchĕnu
kŏṁta nīkṛpārasamu kŏlam̐gulai muṁcham̐gānu
viṁtagām̐ galuva laṭṭĕ vigasiṁchĕnu

(||||)
nĕlam̐tagum̐balugum̐denĕlu nīvu siṁdam̐gānu
alulu siṁdaravaṁdarai mūm̐gĕnu
kaligibai nīvūrbugāli nem̐ḍu visaram̐ga
malimi jakkavalagu paṁjaramu lūḍĕnu

(||||)
pai paim̐ jĕmaḍayeru paḍam̐tibai barabam̐ga
mobulai muttĕbusarulu mŏlagalŏttĕ
yebuna śhrī veṁkaḍeśha yīsadi nīvu gūḍam̐ga
nībŏṁdula bhramasi nivpĕragai nilisĕ