నిన్నూ నన్నూ నెంచుకోని నేరమి గాక
(॥పల్లవి॥)
నిన్నూ నన్నూ నెంచుకోని నేరమి గాక
పన్నిన సూర్యునికాంతి ప్రతిసూర్యుడౌనా
(॥నిన్నూ॥)
జలధిలోపలి మీను జలధి దా నౌనా
జలములాధారమైన జంతువు గాక
నెలవై నీలోనివాడఁ నీవే నే నౌదునా
పొలసి నీయ్యాధరువుబొమ్మ నింతే కాక
(॥నిన్నూ॥)
రాజువద్దనున్న బంటు రాజే తా నౌనా
రాజసపు చనవరి రచనే కాక
సాజమై నిన్నుఁ గొలిచి సరిగద్దె నుందునా
వోజతో నిన్ను సేవించి వుందునింతే కాక
(॥నిన్నూ॥)
ము త్తెపుఁజిప్పల నీరు మున్నీటివలె నుండునా
ముత్తెములై బలిసి లో మొనపుఁ గాక
నిత్తెపు శ్రీవేంకటేశ నీశరణాగతులము
మొత్తపు లోకుల మాముక్తులము గాక
(||pallavi||)
ninnū nannū nĕṁchugoni nerami gāga
pannina sūryunigāṁti pradisūryuḍaunā
(||ninnū||)
jaladhilobali mīnu jaladhi dā naunā
jalamulādhāramaina jaṁtuvu gāga
nĕlavai nīlonivāḍam̐ nīve ne naudunā
pŏlasi nīyyādharuvubŏmma niṁte kāga
(||ninnū||)
rājuvaddanunna baṁṭu rāje tā naunā
rājasabu sanavari rasane kāga
sājamai ninnum̐ gŏlisi sarigaddĕ nuṁdunā
vojado ninnu seviṁchi vuṁduniṁte kāga
(||ninnū||)
mu ttĕbum̐jippala nīru munnīḍivalĕ nuṁḍunā
muttĕmulai balisi lo mŏnabum̐ gāga
nittĕbu śhrīveṁkaḍeśha nīśharaṇāgadulamu
mŏttabu logula māmuktulamu gāga