నిన్నూ నాపెనుఁ జూచి నివ్వెరగందితి నేను
(॥పల్లవి॥)
నిన్నూ నాపెనుఁ జూచి నివ్వెరగందితి నేను
యిన్నేసి చేఁతలు మీకు నిద్దరికే తగును
(॥నిన్నూ॥)
వింత వింత మాటలాడి వెలఁది నీ యెదుటను
దొంతిఁబెట్టీ వలపులు తోడఁదోడను
పంతముతో నేరుపులు పచరించి పచరించి
యెంతకెంత సేసి యాకె యెలయించీ నిన్నును
(॥నిన్నూ॥)
వాడికెగా మోవితేనె వాసనలు చూపి చూపి
కూడపెట్టీ వేడుకలు గుట్టుతో డను
వీడెపు సెలవినవ్వు వెదచల్లి వెదచల్లి
నోడలఁబెట్టీ యీకెంత నోరూరించే నిన్నును
(॥నిన్నూ॥)
సారె సారె రతుకు సమ్మతించ వేఁడుకొని
తూరుపెత్తీఁ దమక మేతులతోడను
కోరి యలమేలుమంగ గూడినశ్రీవేంకటేశ
చేరి నన్నేలితి వాకె చిమ్మిరేఁచీ నిన్నును
(||pallavi||)
ninnū nābĕnum̐ jūsi nivvĕragaṁdidi nenu
yinnesi sem̐talu mīgu niddarige tagunu
(||ninnū||)
viṁta viṁta māḍalāḍi vĕlam̐di nī yĕduḍanu
dŏṁtim̐bĕṭṭī valabulu toḍam̐doḍanu
paṁtamudo nerubulu pasariṁchi pasariṁchi
yĕṁtagĕṁta sesi yāgĕ yĕlayiṁchī ninnunu
(||ninnū||)
vāḍigĕgā movidenĕ vāsanalu sūbi sūbi
kūḍabĕṭṭī veḍugalu guṭṭudo ḍanu
vīḍĕbu sĕlavinavvu vĕdasalli vĕdasalli
noḍalam̐bĕṭṭī yīgĕṁta norūriṁche ninnunu
(||ninnū||)
sārĕ sārĕ radugu sammadiṁcha vem̐ḍugŏni
tūrubĕttīm̐ damaga meduladoḍanu
kori yalamelumaṁga gūḍinaśhrīveṁkaḍeśha
seri nannelidi vāgĕ simmirem̐sī ninnunu