నిన్నింత సేసినందుకు నేనేమి సేతు దాని
(॥పల్లవి॥)
నిన్నింత సేసినందుకు నేనేమి సేతు దాని
అన్నిటా నెక్కెనుఁ గోప మప్పటినుండీరా
(॥॥)
నగవులు వెదచల్లి నయములు మాటలాడి
జిగురువలె నిన్నది చిక్కించెఁగా
పగటులు పచరించి పడఁతి కనుచూపుల
సగమే జళిపంచి జట్టిగొనెఁగా
(॥॥)
నటనలనే నడచి నంటు వినయాలు సేసి
యిటువలె నది బటలీఁదించెఁగా
సటలసిగ్గులు చూపి చాయలు సన్నలు సేసి
కటకటా నిను నింత కరఁగించెఁగా
(॥॥)
కొప్పు దువ్వి నీచెక్కు కొనగోర నంటించి
ముప్పరిఁ జెమటలలో మునిఁగించెఁగా
ఇప్పుడె శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
అప్పు డాకె నిన్నుఁ గూడి అలయించెఁగా
(||pallavi||)
ninniṁta sesinaṁdugu nenemi sedu dāni
anniḍā nĕkkĕnum̐ goba mappaḍinuṁḍīrā
(||||)
nagavulu vĕdasalli nayamulu māḍalāḍi
jiguruvalĕ ninnadi sikkiṁchĕm̐gā
pagaḍulu pasariṁchi paḍam̐ti kanusūbula
sagame jaḽibaṁchi jaṭṭigŏnĕm̐gā
(||||)
naḍanalane naḍasi naṁṭu vinayālu sesi
yiḍuvalĕ nadi baḍalīm̐diṁchĕm̐gā
saḍalasiggulu sūbi sāyalu sannalu sesi
kaḍagaḍā ninu niṁta karam̐giṁchĕm̐gā
(||||)
kŏppu duvvi nīsĕkku kŏnagora naṁṭiṁchi
mupparim̐ jĕmaḍalalo munim̐giṁchĕm̐gā
ippuḍĕ śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
appu ḍāgĕ ninnum̐ gūḍi alayiṁchĕm̐gā