Ninnemeem baluganaidi neegum jaaladaa

నిన్నేమీఁ బలుకనైతి నీకుఁ జాలదా
Language

(॥పల్లవి॥)
నిన్నేమీఁ బలుకనైతి నీకుఁ జాలదా
యిన్నేసి నీ చేఁతలకు నిది చాలదా

(॥నిన్నే॥)
వచ్చినపుడె నిన్ను వద్దఁ గూచుండఁ బెట్టుక
యిచ్చకము లాడితిని యిది చాలదా
మెచ్చుగా నీవప్పటి నీమేడమీఁది కెక్కఁగాను
వచ్చితి నీవెంట వెంట వడి నింత చాలదా

(॥నిన్నే॥)
జలకము లాడఁగాను చలియెల్లఁ బాపితిని
యెలయింపనవ్వులనే యిదిచాదా
వెలయ నీ వారిగించేవేళ పొత్తుకు వచ్చి
అలుగక జాణతనా లాడితిని చాదా

(॥నిన్నే॥)
పవళించి వుండఁగా నీపాదములు గుద్దిగుద్ది
యివల నీమాట వింటి నిది చాలదా
తవిలి శ్రీ వేంకటేశ తతి నన్నుఁ గూడితిని
వివరించి రతు లిఁక వేడుకొంటిఁ జాలదా

(||pallavi||)
ninnemīm̐ baluganaidi nīgum̐ jāladā
yinnesi nī sem̐talagu nidi sāladā

(||ninne||)
vachchinabuḍĕ ninnu vaddam̐ gūsuṁḍam̐ bĕṭṭuga
yichchagamu lāḍidini yidi sāladā
mĕchchugā nīvappaḍi nīmeḍamīm̐di kĕkkam̐gānu
vachchidi nīvĕṁṭa vĕṁṭa vaḍi niṁta sāladā

(||ninne||)
jalagamu lāḍam̐gānu saliyĕllam̐ bābidini
yĕlayiṁpanavvulane yidisādā
vĕlaya nī vārigiṁcheveḽa pŏttugu vachchi
alugaga jāṇadanā lāḍidini sādā

(||ninne||)
pavaḽiṁchi vuṁḍam̐gā nībādamulu guddiguddi
yivala nīmāḍa viṁṭi nidi sāladā
tavili śhrī veṁkaḍeśha tadi nannum̐ gūḍidini
vivariṁchi radu lim̐ka veḍugŏṁṭim̐ jāladā