Ninnemanemu nemu neegemti aasaaramu

నిన్నేమనేము నేము నీకేఁటి ఆచారము
Language

(॥పల్లవి॥)
నిన్నేమనేము నేము నీకేఁటి ఆచారము
కన్నచోట్లను మోటు గాలికి వెఱచునా

(॥నిన్నే॥)
సరసము లేమాడేవు సతుల పయ్యదల
మరిగేవాఁడవు నీకు మాటలు నేల
దరిచేరినవియెల్ల తలపోయ గుల్లలని
ధరలోన ననేమాట తగ నీయందున్నుది

(॥నిన్నే॥)
తొడికేవు నిజముల తొయ్యలులచూపుల
బడిసెవాటవు నీకు బాసలునేల
నుడుగులు దప్పినాను నోముఫలము దప్పదు
అడరఁగ ననుమాట అది నీయందున్నది

(॥నిన్నే॥)
వేసరక నవ్వేవు వెలఁదులరతులకు
ఆసోదకాఁడవు నీకు నంతేశాల
సేసపెండ్లి కొడుకవు శ్రీవేంకటేశ కూడితి
తాసు పయిఁడంతతూకము తగ నీయందున్నది

(||pallavi||)
ninnemanemu nemu nīgem̐ṭi āsāramu
kannasoṭlanu moḍu gāligi vĕṟasunā

(||ninne||)
sarasamu lemāḍevu sadula payyadala
marigevām̐ḍavu nīgu māḍalu nela
dariserinaviyĕlla talaboya gullalani
dharalona nanemāḍa taga nīyaṁdunnudi

(||ninne||)
tŏḍigevu nijamula tŏyyalulasūbula
baḍisĕvāḍavu nīgu bāsalunela
nuḍugulu dappinānu nomuphalamu dappadu
aḍaram̐ga nanumāḍa adi nīyaṁdunnadi

(||ninne||)
vesaraga navvevu vĕlam̐dularadulagu
āsodagām̐ḍavu nīgu naṁteśhāla
sesabĕṁḍli kŏḍugavu śhrīveṁkaḍeśha kūḍidi
tāsu payim̐ḍaṁtadūgamu taga nīyaṁdunnadi