Ninne nammugunnadi neegum gamkanamu gatti

నిన్నే నమ్ముకున్నది నీకుఁ గంకణము గట్టి
Language

(॥పల్లవి॥)
నిన్నే నమ్ముకున్నది నీకుఁ గంకణము గట్టి
అన్నీ నీవెఱుఁగుదువు ఆ(అ?)ననేల ఇఁకను

(॥నిన్నే॥)
య నాపెమాఁటలు విన్నపము సేసితిమి
యెలమిఁ గానుకలూను నిచ్చితిమి
పిలిచి పేరుకొని ప్రియములు చెప్పితిమి
నెలఁ తభాగ్యము మరి నీచిత్తమిఁకను

(॥నిన్నే॥)
నీ విచ్చిన నమ్మికలు నీకుఁ దలఁపించితిమి
వేవేలు చందాల నిన్ను వేఁడుకొంటిమి
చేవదేర నందరము చేతులెత్తి మొక్కితిమి
దేవులాయ నిన్ను నీవే తెలుసుకొమ్మిఁకను

(॥నిన్నే॥)
యిచ్చటికి నిన్నుఁ దెచ్చి ఇద్దరిఁ గూరిచితిమి
కచ్చు పెట్టి సంతోసాలు కనుఁగొంటిమి
యిచ్చగించి యేలితివి యిన్నిటా శ్రీవేంకటేశ
మచ్చికాయ నింతి నిట్టె మన్నించు మిఁకను

(||pallavi||)
ninne nammugunnadi nīgum̐ gaṁkaṇamu gaṭṭi
annī nīvĕṟum̐guduvu ā(a?)nanela im̐kanu

(||ninne||)
ya nābĕmām̐ṭalu vinnabamu sesidimi
yĕlamim̐ gānugalūnu nichchidimi
pilisi perugŏni priyamulu sĕppidimi
nĕlam̐ tabhāgyamu mari nīsittamim̐kanu

(||ninne||)
nī vichchina nammigalu nīgum̐ dalam̐piṁchidimi
vevelu saṁdāla ninnu vem̐ḍugŏṁṭimi
sevadera naṁdaramu sedulĕtti mŏkkidimi
devulāya ninnu nīve tĕlusugŏmmim̐kanu

(||ninne||)
yichchaḍigi ninnum̐ dĕchchi iddarim̐ gūrisidimi
kachchu pĕṭṭi saṁtosālu kanum̐gŏṁṭimi
yichchagiṁchi yelidivi yinniḍā śhrīveṁkaḍeśha
machchigāya niṁti niṭṭĕ manniṁchu mim̐kanu