Ninne mani pogadudu nee vimta sesinamdugu

నిన్నే మని పొగడుదు నీ వింత సేసినందుకు
Language

(॥పల్లవి॥)
నిన్నే మని పొగడుదు నీ వింత సేసినందుకు
కన్నుల నే జంకించితే కరుణఁ జూచితివి

(॥నిన్నే॥)
అప్పటప్పటికి నేము ఆడేవెల్లా వెంగెములే
తప్పులెల్లా నోరుచుకో దండము నీకు
చెప్పేవారిమాట విని చేరి మే మలుగురుము
యెప్పుడు నిండుదొరవు యెగ్గు లెంచవైతివి

(॥నిన్నే॥)
కావరించి కినుతుము కలతుము నీ మనసు
వేవేలు నోరుచుకుమ్మీ వేడుకొనేము
వావి మాకు గద్దు గాన వడిగానే నవ్వుదుము
భావుంచ జాణవు గాన పంత మాడ వైతవి

(॥నిన్నే॥)
చెంగట నుందుము గాన చెనకితి మెంతైన
అంగవించుకొమ్మీ యిచ్చలై నఁ జేసేము
రింగుగా శ్రీ వేంకటేశ రతిఁ గూడితివి నన్ను
సంగతి మించితిగాన చనవు లిచ్చితివి

(||pallavi||)
ninne mani pŏgaḍudu nī viṁta sesinaṁdugu
kannula ne jaṁkiṁchide karuṇam̐ jūsidivi

(||ninne||)
appaḍappaḍigi nemu āḍevĕllā vĕṁgĕmule
tappulĕllā norusugo daṁḍamu nīgu
sĕppevārimāḍa vini seri me malugurumu
yĕppuḍu niṁḍudŏravu yĕggu lĕṁchavaidivi

(||ninne||)
kāvariṁchi kinudumu kaladumu nī manasu
vevelu norusugummī veḍugŏnemu
vāvi māgu gaddu gāna vaḍigāne navvudumu
bhāvuṁcha jāṇavu gāna paṁta māḍa vaidavi

(||ninne||)
sĕṁgaḍa nuṁdumu gāna sĕnagidi mĕṁtaina
aṁgaviṁchugŏmmī yichchalai nam̐ jesemu
riṁgugā śhrī veṁkaḍeśha radim̐ gūḍidivi nannu
saṁgadi miṁchidigāna sanavu lichchidivi