నిన్నరాని కోపము నేఁడేఁటికే
(॥పల్లవి॥)
నిన్నరాని కోపము నేఁడేఁటికే
పన్ని నీ చేఁతలచే భ్రమయించరాదా
(॥నిన్న॥)
మొగము చూచి నీపై మోహ మాతఁడు చల్లఁగా
నగరాదా కొంతైనా నాలి యేఁటికే
బిగువు చూపకుండితే పిరిదీసినట్లుండు
తెగువతో దీమసము తెచ్చుకోరాదా
(॥నిన్న॥)
దగ్గర వచ్చి విభుఁడు తమకము రేఁచఁగాను
సిగ్గులు విడువరాదా చింతలేఁటికే
కగ్గుదేరి యంటకున్న కై కోనియట్లుండు
వెగ్గళించి మచ్చికలు వెదచల్లరాదా
(॥నిన్న॥)
శ్రీవేంకటేశుడు నిన్ను జిత్తగించి కూడఁగాను
భావించి మెచ్చఁగరాదా పంత మేఁటికే
మోవితేనే లియ్యకున్న మొరగినయట్లనుండు
సావధానాన నన్నిటా చనవియ్యరాదా
(||pallavi||)
ninnarāni kobamu nem̐ḍem̐ṭige
panni nī sem̐talase bhramayiṁcharādā
(||ninna||)
mŏgamu sūsi nībai moha mādam̐ḍu sallam̐gā
nagarādā kŏṁtainā nāli yem̐ṭige
biguvu sūbaguṁḍide piridīsinaṭluṁḍu
tĕguvado dīmasamu tĕchchugorādā
(||ninna||)
daggara vachchi vibhum̐ḍu tamagamu rem̐sam̐gānu
siggulu viḍuvarādā siṁtalem̐ṭige
kagguderi yaṁṭagunna kai koniyaṭluṁḍu
vĕggaḽiṁchi machchigalu vĕdasallarādā
(||ninna||)
śhrīveṁkaḍeśhuḍu ninnu jittagiṁchi kūḍam̐gānu
bhāviṁchi mĕchcham̐garādā paṁta mem̐ṭige
movidene liyyagunna mŏraginayaṭlanuṁḍu
sāvadhānāna nanniḍā sanaviyyarādā