Ninnane padi ninu goodenu nee kade saaladade

నిన్ననే పతి నిను గూడెను నీ కదే చాలదటే
Language

(॥పల్లవి॥)
నిన్ననే పతి నిను గూడెను నీ కదే చాలదటే
అన్నిట నింకా విడువని యాసోదం బేలే

(॥నిన్ననే॥)
చక్కని చన్నుల మీదట చంద్రోదయమై వుండగ
చిక్కని నీమతి చింతలచీఁకటి యిఁక నేలే
దిక్కుల నీపతి మాటల తేనెలు చెలిచే నంపెను
తక్కక యెండినపెదవుల దప్పులు యిఁక నేలే

(॥నిన్ననే॥)
జల్లన జెమటల వానల జడిగొని కురియుచునుండఁగ
వెల్లాయపు విరహంబుల వేసవి యిఁక నేలే
గల్లన నీపతిచూపులకలువలు నీ కందియ్యఁగ
మల్లడి మరుశరములకును మారుకొన వదేలే

(॥నిన్ననే॥)
కందువఁ దలపోసినపతి కౌఁగిటిలోపల నుండఁగ
యిందును నందును నడుముల యెడమాట లవేలే
అందపు శ్రీవేంకటపతి యాతఁడే నిను మన్నించఁగ
గొందుల సందుల కూరిమి కొసరులు నీ కేలే

(||pallavi||)
ninnane padi ninu gūḍĕnu nī kade sāladaḍe
anniḍa niṁkā viḍuvani yāsodaṁ bele

(||ninnane||)
sakkani sannula mīdaḍa saṁdrodayamai vuṁḍaga
sikkani nīmadi siṁtalasīm̐kaḍi yim̐ka nele
dikkula nībadi māḍala tenĕlu sĕlise naṁpĕnu
takkaga yĕṁḍinabĕdavula dappulu yim̐ka nele

(||ninnane||)
jallana jĕmaḍala vānala jaḍigŏni kuriyusunuṁḍam̐ga
vĕllāyabu virahaṁbula vesavi yim̐ka nele
gallana nībadisūbulagaluvalu nī kaṁdiyyam̐ga
mallaḍi maruśharamulagunu mārugŏna vadele

(||ninnane||)
kaṁduvam̐ dalabosinabadi kaum̐giḍilobala nuṁḍam̐ga
yiṁdunu naṁdunu naḍumula yĕḍamāḍa lavele
aṁdabu śhrīveṁkaḍabadi yādam̐ḍe ninu manniṁcham̐ga
gŏṁdula saṁdula kūrimi kŏsarulu nī kele