నిన్నఁ గుప్ప నేఁడాళ్లు నీ చేఁతలు
(॥పల్లవి॥)
నిన్నఁ గుప్ప నేఁడాళ్లు నీ చేఁతలు
యెన్నుకొంటె నాకంటె యెక్కుడా నీవు
(॥నిన్న॥)
వేడుకతో సొలసేవు విభునితో బులిసేప
యేడ నేరుచుకొంటివే యింతేసి నీవు
వాడికలు నెరుపేవు వడిఁబొందు జరుపేవు
చూడఁ గొత్తలాయనే నీసొంపులనటనలు
(॥నిన్న॥)
కప్పురాన వేసేవు కందువకఁ దీసేవు
చెప్పిరానిదే నీ యెమ్మెలు చెల్లఁబో నేఁడు
కొప్పు చక్కఁదురిమేవు కొనగోర మెరమేవు
అప్పుడే యింతటిదాన వైతివటే నీవు
(॥నిన్న॥)
చలములు సాదించేవు సన్నల బోదించేవు
తెలుసుకొంటిమే నీ తెరఁగులెల్లా
యెలమి శ్రీవేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడె
తొలుతటినాతో నీవు తులఁదూఁగఁ గలవా
(||pallavi||)
ninnam̐ guppa nem̐ḍāḽlu nī sem̐talu
yĕnnugŏṁṭĕ nāgaṁṭĕ yĕkkuḍā nīvu
(||ninna||)
veḍugado sŏlasevu vibhunido buliseba
yeḍa nerusugŏṁṭive yiṁtesi nīvu
vāḍigalu nĕrubevu vaḍim̐bŏṁdu jarubevu
sūḍam̐ gŏttalāyane nīsŏṁpulanaḍanalu
(||ninna||)
kappurāna vesevu kaṁduvagam̐ dīsevu
sĕppirānide nī yĕmmĕlu sĕllam̐bo nem̐ḍu
kŏppu sakkam̐durimevu kŏnagora mĕramevu
appuḍe yiṁtaḍidāna vaidivaḍe nīvu
(||ninna||)
salamulu sādiṁchevu sannala bodiṁchevu
tĕlusugŏṁṭime nī tĕram̐gulĕllā
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐gūḍĕ
tŏludaḍinādo nīvu tulam̐dūm̐gam̐ galavā